Tollywood: కరోనాతో ప్రముఖ సింగర్ మృతి!

Tollywood singer Jai Srinivas dies of Covid-19
x

 'జై' శ్రీనివాస్ ఫైల్ ఫోటో  

Highlights

Tollywood: 'జై' సినిమాలోని'దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జండా మనదే..' అనే అద్భుతమైన పాటతో పాపులర్ అయ్యారు.

Tollywood: క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్ఠిస్తుంది. ఈ మ‌హ‌మ్మ‌రి ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత ఇండస్ట్రీలో కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా కొన్నిరోజులు జరిగాయి. కరోనా తీవ్రత ఎక్కువ అవ్వడంతో సినిమాలు నిలిచిపోయాయి. ఈ మ‌హమ్మారి వైర‌స్ సామాన్యుల నుంచి సెల‌బ్రీటీల వ‌ర‌కు ఎవ‌రిని వ‌ద‌లిపెట్ట‌డం లేదు. టాలీవుడ్ పై క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గానే ప‌డింది. ఈ వైర‌స్ బారిన ప‌డి ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు, న‌టులు క‌న్నూముశారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సింగ‌ర్ సింగర్ నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ 'జై' శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ మరణం పట్ల తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా స్పందించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ 'జై' శ్రీనివాస్ హీరో నవదీప్ నటించిన 'జై' సినిమాలోని'దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జండా మనదే..' అనే అద్భుతమైన పాటతో పాపులర్ అయ్యారు. ఆయన గత కొద్దీరోజులుగా కరోనా బారినపడి సికింద్రాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ కేవలం సినిమా పాటలే కాకుండా ఎన్నో దేశభక్తి గీతాలను పాడారు. తెలుగులో చాలా సూపర్ సిమాలకు శ్రీనవాస్ పాటలు పాడారు. ప్రైవేట్ ఆల్బమ్, షార్ట్ ఫిలిమ్స్ ,వెబ్ సిరీస్ లలో పాటలకు కూడా ఆయన గాత్రం అందించారు. అలాంటి టాలెంటెడ్ సింగర్ మరణం గురించి వార్తలు తెలియగానే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories