Top
logo

Tollywood: ఏపీ సీఎం జగన్‌ను కలవడానికి పోటీ పడుతున్న టాలీవుడ్ పెద్దలు

Tollywood Seniors Ready to Meet AP CM Jagan
X

ఏపీ సీఎంను కలువనున్న టాలీవుడ్ పెద్దలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Tollywood: రెండు వర్గాలుగా విడిపోయి కలవడానికి ప్రయత్నాలు * త్వరలో జగన్‌ను కలవనున్న చిరంజీవి బృందం

Tollywood: టాలీవుడ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం జగన్‌ను కలవడానికి రెడీ అవుతున్నారు సిని పెద్దలు. జగన్ అపాయిట్‌మెంట్ ఇవ్వగానే వెళ్ళి కలవడానికి రెడీగా ఉన్నారు. అయితే జగన్‌తో భేటీకి పోటాపోటిగా రెడీ అవుతున్నారు. ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి బృందం మరో వైపు నిర్మాత నట్టికుమార్ వర్గం కూడా సీఎం జగన్‌తో భేటికి పావులు కదుపుతుంది.

చిరు వర్గం కంటే ముందే తమకు అపాయిట్‌మెంట్ వస్తుందని నిర్మాత నట్టి కుమార్ థీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్న నిర్మాతల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు నట్టి కుమార్. చిరంజీవి తన టీం తో జగన్‌ను కలసినా కేవలం పెద్ద సినిమాల టికెట్ల ధరలు, పార్కింగ్ ఫీజులు, అదనపు షోల గురించే మాట్లాడతారు తప్ప చిన్న నిర్మాతల గురించి ప్రస్తావించరని నట్టి కుమార్ చెప్తున్నాడు.

ఏపీ సీఎం జగన్ ఏ వర్గానికి ముందుగా అపాయిట్‌మెంట్ ఇస్తారో అనే ఉత్కంఠ టాలీవుడ్‌లో నెలకొంది. ఎవరికి వారే విడివిడిగా అపాయింట్‌మెంట్లను తీసుకోని జగన్‌ను కలవడానికి ప్రయత్నాలు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చకు దారితీస్తోంది.

Web TitleTollywood Seniors Ready to Meet AP CM Jagan
Next Story