Lock Down పాటిద్దాం..ఆసుపత్రులు చూసి రండి..నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

‍Nag Ashwin comments on Lock Down
x

నాగ్ అశ్విన్ ఫైల్ ఫోటో 

Highlights

Lock Down:కరోనా వైరస్ విలయతాండవంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.

Lock Down: కరోనా వైరస్ విలయతాండవంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై మంత్రి ఈటెల కూడా క్లారీటి ఇచ్చారు. లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. మే 2తర్వాత లాక్‌డౌన్‌ కచ్చితంగా ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండబోతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు 'మహానటి'ఫేమ్ నాగ్ అశ్విన్. లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా రానున్న కొద్ది రోజులు ఇంట్లోనే ఉందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన..'లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా.. రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌ పాటిద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు లాక్‌డౌన్‌ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో వాళ్లందరూ ఒక్కసారి వెళ్లి ఆసుపత్రులను చూసి రండి. అలాగే గడిచిన నెల రోజుల నుంచి వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడండి. కాబట్టి, తప్పనిసరిగా మనందరం వ్యాక్సిన్‌ వేయించుకుందాం. వైద్యులకు కొంత రిలీఫ్‌ని అందిద్దాం' అని నాగ్‌అశ్విన్‌ ట్వీట్‌ చేశారు.

నాగ్‌ అశ్విన్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ సినిమా నిర్మించనున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. నాగ్ అశ్విన్ నిర్మాతగా చేసిన జాతిరత్నాలు ఇటీవలే విడుదల అయింది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆల్ టైం హిట్‌గా నిలిచింది. జాతిరత్నాలు సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories