రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు
x
దిల్ రాజు ఫైల్ ఫోటో
Highlights

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంతో మరణించారు. అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు. దీంతో దిల్ రాజును మరో పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు సలహాలు ఇచ్చారని, అందుకే ఆ వైపు ఆలోచించి దిల్ రాజు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై దిల్ రాజుకు స్పందించారు. నేను ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ చేసుకునే ఉద్దేశ్యం ఉంటే అందరి సమక్షంలో చేసుకుంటాని స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక ఇంగ్లీష్‌ పేపర్‌లో వచ్చిన కథనం అని జస్ట్ పుకారు వివరణ ఇచ్చారు.

దిల్ రాజు తన సొంత వెంకటేశ్వర ప్రొడక్షన్ హౌస్ తన సినిమాలకు భార్య పేరునే ముందుగా వేస్తుంటాడు. దిల్ రాజు ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 'జాను' తో ఫీల్ గుడ్ మూవీని నిర్మించారు. నాచురల్ స్టార్ నాని 'వీ' సినిమాతో రానున్నాడు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'పింక్' రీమేక్ కు తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు రెండో పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories