బాలకృష్ణ వస్తానంటే కాదంటారా? బాలయ్య వ్యాఖ్యలకు సి. కళ్యాణ్ కౌంటర్

బాలకృష్ణ వస్తానంటే కాదంటారా? బాలయ్య వ్యాఖ్యలకు సి. కళ్యాణ్ కౌంటర్
x
Balakrishna, C.Kalyan (File Photo)
Highlights

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కూడా కలవబోతున్నట్లు చిరంజీవి ట్వీట్ లో తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బాలకృష్ణ మాట్లాడుతూ.. చిత్రీకరణ అంశాలపై ప్రభుత్వంతో సినీ పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని తెలిపారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్.

నిజానికి బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు.. నన్ను పిలవలేదు అనడానికి ఇది ఆర్టిస్ట్‌ల మీటింగ్ కాదు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు అంటే ఆయన సినిమా షూటింగ్ ఆగిపోయింది కాబట్టి వచ్చి అడిగి లీడ్ చేశారు తప్పితే మరోటి కాదు. ఇది చిన్న నాన్ సింక్‌లో ఉంది. బాలకృష్ణ గారు వస్తానంటే ఎవరైనా కాదంటారా? అంతే తప్పితే ఒకరిని పిలవాలని, వద్దని ఎవరు చెప్పారు.. బాలకృష్ణ గారు మా హీరో... ఆయనకు ఇక్కడ జరిగింది మొత్తం చెప్పాను. మీడియా అడగడం వల్ల.. నన్ను పిలవలేదు, పేపర్‌లలో చూసి తెలుసుకుంటున్నా అని అన్నారు తప్పితే.. ఇది ఆర్టిస్ట్‌లను పిలిచే మీటింగ్ కాదు. అవసరం అనుకుంటే తప్పకుండా పిలుస్తాం.

తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు లీడ్ చేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. అంతేతప్ప మాలో విభేదాలు అనేవి లేవు. ఇండస్ట్రీలో ఏమీ తెలియని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా అందర్నీ కలుపుకునే ముందుకు వెళ్లబోతున్నాం అని అన్నారు. చిరంజీవి గారిని మేం అడిగాం. ఆయన ముందుకు వచ్చారు. బాలయ్యగారు మీకు అవసరం అయితే చెప్పండి నేనూ వస్తా అన్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories