పెరిగిన గుడ్డు ధర.. బెంబేలెత్తిన బండ్ల గణేష్

పెరిగిన గుడ్డు ధర.. బెంబేలెత్తిన బండ్ల గణేష్
x
Bandla Ganesh (File Photo)
Highlights

కరోనా వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకి గురి అవుతున్నారు.

కరోనా వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకి గురి అవుతున్నారు. అయితే ఇదీ ముఖ్యంగా జంతువుల నుంచే వస్తుందని తెలియడంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. చికెన్ అంటే అమ్మో వద్దు అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇక గుడ్డు ధర సైతం తగ్గిపోయింది. మొన్నటి వరకూ రూ. 3 ఉన్న కోడిగుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 6గా ఉంది. ఇక చికెన్, గుడ్లు తింటే కరోనా రాదని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వాలు కూడా చెప్పడంతో మళ్ళీ చికెన్, గుడ్ల ధరలకి రెక్కలు వచ్చాయి.

ఇక ఇది ఇలా ఉంటే గుడ్లు, చికెన్‌ని విపరీతంగా కొనేస్తున్నారని దీంతో రేట్లు భారీగా పెరిగిపోయాయని ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనంపై ప్రముఖ నటుడు, పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకుడు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. " కొండెక్కిన కోడిగుడ్డు ధర అని ఈరోజు ప్రముఖ దిన పత్రికలో చదివాను.. కోళ్ల పరిశ్రమ అంటే చికెన్ కి సంబంధించిన కోడి కాదు కోడి రైతు అంటే కోడిగుడ్లు అమ్ముకునే వాడని రైతు అంటారు. కోట్ల నష్టాల్లో లేయర్ కోడి రైతు గుడ్డు పెట్టి ఇచ్చే పత్తి కోడి రైతు కష్టాల్లోనే ఉన్నారు.

ఈరోజు మా ఉత్పత్తి ధర నాలుగు రూపాయల 20 పైసలు అవుతుంది. మాకు మాత్రం రెండు రూపాయల ఎనభై పైసల నుంచి మూడు రూపాయలు మాత్రమే వస్తుంది మా నష్టాన్ని దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కాపాడటానికి ప్రయత్నించండి అంటూ దండం పెడుతూ ట్వీట్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. స్టార్ హీరోల తో సినిమాలను తెరకెక్కించిన బండ్ల గణేష్.. స్టార్ ప్రొడ్యూసర్ అని అనిపించుకున్నాడు. చివరగా టెంపర్ సినిమాని తెరకెక్కించిన బండ్ల గణేష్ సినిమాలను పక్కన పెట్టేశారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories