Tollywood: ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు సెకనుకు ₹10 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ హీరోయిన్.. రేంజ్ అసలే వేరే లెవెల్!

Tollywood: ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు సెకనుకు ₹10 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ హీరోయిన్.. రేంజ్ అసలే వేరే లెవెల్!
ఒకప్పుడు టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, మోడలింగ్ రంగంలో తన టాలెంట్‌ను చూపించింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టి వరుస విజయాలతో స్టార్‌గా ఎదిగింది. ఈ రోజు దేశంలోని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది.

కేరళలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన నయనతార, నటనపై ఉన్న మక్కువతో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని టాప్ హీరోయిన్‌గా మారింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్, మార్కెట్ స్థాయిలో ఏ స్టార్ హీరోకి తగ్గదు.
ఇటీవల నయనతార తన రెమ్యునరేషన్ విషయంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఓ టాటా స్కై యాడ్ కోసం 50 సెకన్ల కాలానికే ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు బయటకొచ్చాయి. అంటే సెకనుకు రూ. 10 లక్షలు అన్నమాట! ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగినట్టు సమాచారం. స్టార్ హీరోలే ఒక యాడ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకోని సమయంలో, నయనతారకి ఇంత భారీ పారితోషికం అందడం ఆశ్చర్యమే కాదు, ఆమె స్థాయిని స్పష్టంగా చూపిస్తోంది.
#LadySuperStar is absolutely living her dream life & ticking off one milestone after another. Now a Director! Yes! Bring It On! can't wait to watch the Boss Lady in Action with this Ad! Heard this is going to be a jolly ad… So Excited 😀💪#Director #Nayanthara pic.twitter.com/kWItHYJaR8
— NayantharaLive (@NayantharaLive) July 12, 2025
ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. పలు క్రేజీ ప్రాజెక్టులతో నయనతార బిజీగా ఉంది. సినిమాలో మాత్రమే కాదు, ప్రకటనల జాబితాలోనూ ఆమె స్థానం టాప్‌లెవెల్ అనే విషయం మరొసారి నిరూపితమైంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire