
లాక్ డౌన్ వేళ టాలీవుడ్ స్టార్లు ఇళ్లకే పరిమితం అయ్యారు.. దీంతో ఇళ్లలో పనులు చేస్తూ అలరిస్తున్నారు.
లాక్ డౌన్ వేళ టాలీవుడ్ స్టార్లు ఇళ్లకే పరిమితం అయ్యారు.. దీంతో ఇళ్లలో పనులు చేస్తూ అలరిస్తున్నారు. తెరపైన, తెర వెనుక ఉంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈ సమయంలో పలు రకాల ఛాలెంజ్ విసురుతూ తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నారు.
టాలీవుడ్‌లో 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ ఛాలెంజ్ దర్శకధీరుడు రాజమౌళి లాంటి వారి ద్వారా పాపులర్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ ,రామ్ చరణ్, చిరంజీవి, హీరోలు ఈ ఛాలెంజ్‌లో పాలుపంచుకొన్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను నామినేట్ చేశారు. సుకుమార్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బుధవారం తన వీడియోను ట్వీట్ చేశారు. వీడియో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ వీడియోలో దేవి శ్రీ తన మేనల్లుడిని భాగం చేశారు. దేవి మేనల్లుడు తనవ్ సత్య ఆయనతో పనులు చేయించారు.
దేవిశ్రీ చీపురుతో ఇల్లు ఊడ్చి టీవీ, స్పీకర్స్, సోఫాలు అన్నీ శుభ్రం చేశారు.. తల్లికి ఆమ్లెట్ వేసి పెట్టారు.. చివరిగా తన తండ్రి సత్యమూర్తి గారి ఫొటోలను శుభ్రం చేసి నమస్కరించారు. ఆ తర్వాత కన్నడ రాక్‌స్టార్ యష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హీరో కార్తి, డైరెక్టర్ హరీష్ శంకర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌లను దేవిశ్రీ నామినేట్ చేశారు.
Here's my #betheREALMAN video Dear SUKU BHAI @aryasukku 😁
— DEVI SRI PRASAD (@ThisIsDSP) April 29, 2020
Wit an Entertaining Effort😜@imvangasandeep @ssrajamouli @KChiruTweets
Nw I request My Dear Friends@alluarjun @Karthi_Offl @TheNameIsYash @harish2you
&
Our Lalettan
Dear @Mohanlal sir
2 take d Challnge Forwd🙏🏻 pic.twitter.com/6CnIgFy6P8

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




