సమ్మర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు సినిమాలు

సమ్మర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు సినిమాలు
x
Highlights

సినిమాలు రిలీజ్ చేయడానికి బెస్ట్ సీజన్స్ లో సమ్మర్ ఒకటి. కానీ కరోనా మహమ్మారి కారణంగా 2020 సమ్మర్ సీజన్ లో సినిమా వినోదం లేకుండా పోయింది. అయితే గతేడాది...

సినిమాలు రిలీజ్ చేయడానికి బెస్ట్ సీజన్స్ లో సమ్మర్ ఒకటి. కానీ కరోనా మహమ్మారి కారణంగా 2020 సమ్మర్ సీజన్ లో సినిమా వినోదం లేకుండా పోయింది. అయితే గతేడాది ఎంటర్ టైన్ మెంట్ కి దూరంగా ఉన్న సినీ అభిమానులను ఈ సమ్మర్ లో తనివి తీర వినోదం నింపడానికి టాలీవుడ్ రెడీ అయింది. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలన్నీ విడుదల తేదీలను ప్రకటించారు. ఇక 100% థియేటర్స్ ఆక్యుపెన్సీ తో ఈ సమ్మర్ బిజినెస్ ఎంతో ఓ లుక్కేద్దాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ సమ్మర్ లోనే రానుందని తెలుస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఈ చిత్రానికి వడ్డీలతో కలుపుకొని సుమారు 100 కోట్ల బడ్జెట్ పెట్టారని టాక్. ఇక అక్కినేని నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరీ' చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఏషియన్ వారు సుమారు 40 కోట్లు ఖర్చు చేసారని తెలుస్తోంది. అలానే మరో అక్కినేని వారసుడు అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాకి 40 కోట్ల వరకు ఖర్చు అయిందట. ఈ సినిమా రీ షూట్స్ చేస్తూ డిలే చేయడం వల్ల జీఏ 2 ప్రొడక్షన్ వారు ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చిందని టాక్.

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యాట్నీ మూవీస్ - కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రానికి దాదాపుగా 120 కోట్ల వరుకు ఖర్చు చేయనున్నారట. ఇక 'విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'నారప్ప' సినిమాని మే 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ రైట్స్ అన్నీ కలుపుకుని సురేశ్ బాబు 40 కోట్ల దాకా ఖర్చు పెట్టాడని టాక్. యష్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్2' జూలై 16న విడుదల అవుతుంది. చాప్టర్ 1 భారీ వసూళ్లు రాబట్టడంతో చాప్టర్ 2 కోసం దాదాపు 100 కోట్లు పైనే ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' సినిమా కూడా సమ్మర్ లోనే విడుదలైదే మరో 300 కోట్లు బడ్జెట్ యాడ్ అవుతుంది.

ఇదంతా చూసుకుంటే కేవలం సమ్మర్ లోనే టాలీవుడ్ లో దాదాపుగా 700 కోట్లు పైనే బిజినెస్ జరగనుంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బిజినెస్ ఈ రకంగా ఉంటే మరి లాభాలు ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories