'మా' ప్రెసిడెంట్‌ని నాకే సమాచారం ఇవ్వలేదు.. బాలయ్య కామెంట్ పై నరేష్ రియాక్షన్

మా ప్రెసిడెంట్‌ని నాకే సమాచారం ఇవ్వలేదు.. బాలయ్య కామెంట్ పై నరేష్ రియాక్షన్
x
Balakrishna, Naresh(File photo)
Highlights

సినీ పెద్దలు ముఖ్యమంత్రులతో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు.

సినీ పెద్దలు ముఖ్యమంత్రులతో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కూడా కలవబోతున్నట్లు చిరంజీవి ట్వీట్ లో తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. చిత్రీకరణ అంశాలపై ప్రభుత్వంతో సినీ పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని అన్నారు. ఇండస్ట్రీ కోసం జరుగుతున్న చర్చలను భూములు పంచుకుంటున్నారా? అంటూ బాలయ్యా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

బాలయ్య చేసిన వ్యాఖ్యలను నిర్మాత సి కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ఖండించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) అధ్యక్షుడు నరేష్ స్పందించారు. బాలయ్య అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదని నరేష్ అన్నారు. టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వాలతో జరిపిన చర్చలకు తనకూ సమాచారం లేదని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన నరేష్..

నేను మా ప్రెసిడెంట్‌ని నాకూ ఏం చెప్పలేదు.. కాని ఎక్కడకు పిలుస్తారో అక్కడకు వెళ్లడమే మంచిది. చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు..సినిమా పరిశ్రమ అంతా ఒకటే అన్నారు. వాళ్లు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధం.. ఇవాళ పిలిచారు వెళ్ళాను.. ఒకవేళ పిలవక పోతే ఆగిపోతా. పరిశ్రమ క్లిష్టపరిస్థితులో ఉన్నప్పుడు గట్టెక్కించే బాధ్యత అందరికి ఉందని నరేశ్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories