Kumar Vatti: టాలీవుడ్ లో విషాదం.. కరోనాతో యువ దర్శకుడు మృతి

Tollywood Director Kumar Vatti Passes Away Due to Corona
x

Director Kumar Vatti: (File Image)

Highlights

Kumar Vatti: గత ఏడాది ఈ మహమ్మారి బారిన పడి కొందరు ప్రముఖులు మృతి చెందారు.

Kumar Vatti: కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. గత ఏడాది ఈ మహమ్మారి బారిన పడి కొందరు ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ దర్శకుడు ఈ మహామ్మరికి బలైయ్యాడు. దీంతో తెలుగు సినీ పరిశ్రమంలో విషాదం నెలకొంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి(39) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్ వట్టి 30 కి పైగా చిత్రాలలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు.

నరసన్నపేటకు చెందిన కుమార్ వట్టి 2017లో 'మా అబ్బాయి' అనే సినిమాతో దర్శకుడిగా మారారు. శ్రీవిష్ణు హీరోగా, ప్రఖ్యాత ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ కాంబినేషన్‌లో ఎంట్రీ ఇచ్చారు. కుమార్ వట్టి దర్శకుడు పరుశురాం దగ్గర 'యువత' సినిమా అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత సోలో, అంజనేయులు, సారొచ్చారు చిత్రాలకు కూడా పనిచేశారు. అలాగే డైరెక్టర్‌గా రెండో సినిమాకు కథను కూడా సిద్ధం చేసుకున్నారు.

కరోనా కారణంగా శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూన్నారు. అయితే గత రాత్రి కుమార్ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. విరాట పర్వం డైరెక్టర్‌ వేణు ఉడుగుల ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు.ఈ సందర్భంగా కుమార్‌ వట్టి కుటుంబానికి ప్రగాఢసానుభూతి ప్రకటించారు. కుమార్ మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది. పలువురు ప్రముఖులు కుమర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories