అయ్యో! ఆ హీరోను చంపేసి మళ్ళీ బతికించారట!

అయ్యో! ఆ హీరోను చంపేసి మళ్ళీ బతికించారట!
x
Highlights

మీడియా ఒక్కోసారి భలే విచిత్రాలు చేస్తుంది. సమాచార లోపం కావచ్చు.. అక్కడ పనిచేసే వారి అత్యుత్సాహం కావచ్చు అచ్చులో వచ్చిన కొన్ని వార్తలు ఇబ్బందులు తెచ్చిపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇదీ ఒకటి.

మీడియా ఒక్కోసారి భలే విచిత్రాలు చేస్తుంది. సమాచార లోపం కావచ్చు.. అక్కడ పనిచేసే వారి అత్యుత్సాహం కావచ్చు అచ్చులో వచ్చిన కొన్ని వార్తలు ఇబ్బందులు తెచ్చిపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇదీ ఒకటి. మంచి కాఫీ లాంటి సినిమాతో.. ఇటువంటి వాడు మనకు కూడా ఫ్రెండ్ అయితే బావినుండును అనేంత అభిమానాన్ని పోగేసుకున్న నటుడు రాజాకు ఎదురైన అనుభవం వింటే మతి పోతుంది. హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రజల అభిమానాన్ని కొల్లగొట్టిన రాజా (ఓసి చిన్నదానా..ఆనంద్ సినిమాలు హీరో) ఓ విచిత్రమైన అనుభవం ఎదుర్కొన్నారు. ఒక పత్రికలో రాజా ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వార్త ప్రచురించారు ఆ మధ్య కాలంలో. రాజా సోదరి ఆ పత్రిక పట్టుకుని రాజా దగ్గరకు వచ్చారట. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని రాశారు అని చెప్పారట. దానికి రాజా ఇప్పుడే ఆత్మహత్య చేసుకున్నాను.. అప్పుడే వార్త వచ్చిందా అని ఆమెతో అన్నారట. తరువాత సదరు పత్రికకు ఫోన్ చేసి నేను బ్రతికే ఉన్నాను అంటూ చెప్పుకున్నారు రాజా. తరువాత ఆ పత్రిక మరునాడు రాజా ఆత్మహత్య వార్త పొరపాటున ప్రచురించాం అని పత్రికలో రాసుకొచ్చింది. అయితే, ఆత్మహత్య వార్తా మొదటి పేజీలో ప్రచురించిన ఆ పత్రిక రాజా బ్రతికే ఉన్నారనే వార్తను మాత్రం లోపలి పేజీల్లో ఎక్కడో ఒక మూల ప్రచురించింది. ఈ విషయాన్ని రాజా స్వయంగా వెల్లడించారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెబుతూ నవ్వుకున్నారు.

విశాఖపట్నంలో పుట్టిన రాజా..జీవితమంతా కష్టాల్లోనే గడిచింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాజాను అయన ఇద్దరు అక్కలు పెంచి పెద్ద చేశారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన రాజా అక్కడ గ్రీన్ పార్క్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేశారు. తరువాత ముంబైలో మోడలింగ్ ప్రయత్నాల్లో ఉండగా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చూసి సినిమాల్లో అవకాశం కల్పించారు. అయితే, రాజా తొలిసినిమా అనుకోకుండా ఆగిపోయింది. తరువాత కొంత కాలానికి శ్రీకాంత్ హీరోగా ఈవీవీ తమ్ముడు ఈ సత్తిబాబు తెరకెక్కించిన సినిమా ఓ చిన్నదానా సినిమాలో శ్రీకాంత్ తో పాటు ఒక హీరోగా అవకాశం ఇచ్చారు. తరువాత సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో విజయం అనే సినిమాలో నటించిన రాజాకు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో బ్రేక్ ఇచ్చారు. తరువాత దాదాపు ౩౦ సినిమాలు నటించిన రాజా క్రమేపీ వెండి తెరకు దూరం అయ్యారు. ప్రస్తుతం అయన పాస్టర్ గా జీవితాన్ని గడుపుతున్నారు.
హీరో రాజా తన అనుభవాలను ఆలీతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. తాను మళ్ళీ ఇక సినిమాల్లో నటించే ఛాన్స్ లేదని కుండా బద్దలు కొట్టినట్టు చెప్పిన రాజా సినిమాల్లో నటించాలని ఎవరైనా అనుకుంటే ఆ ఆలోచన మానుకోమని తాను సలహా ఇస్తాను అని చెప్పారు.
Show Full Article
Print Article
Next Story
More Stories