ప్రభాస్ సలహా మేరకే మెగాస్టార్ ఆ సినిమా చేస్తున్నారట

ప్రభాస్ సలహా మేరకే మెగాస్టార్ ఆ సినిమా చేస్తున్నారట
x
Prabhas, Chiranjeevi (File Photo)
Highlights

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ సూపర్ హిట్ చిత్రం 'లూసిఫర్'. ఈ సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నారు. అయితే లూసిఫర్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయమని చరణ్, చిరంజీవిలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలహా ఇచ్చారని టాక్.

చిరంజీవి వయసు ఇమేజ్‌కు ఈ మూవీ కరెక్ట్‌గా సరిపోతుందని ప్రభాస్ చెప్పారట. అందుకే రాంచరణ్ 'లూసిఫర్' రీమేక్ రైట్స్ కొనుగోలు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను 'సాహో' డైరెక్టర్ సుజీత్‌కు అప్పగించమని సలహా ప్రభాస్ ఇచ్చారంట.మెగాస్టార్ చిరంజీవికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మంచి అనుబంధం ఉంది. 'రాఘవేంద్ర' సినిమా సమయంలోనే చిరంజీవి ప్రభాస్ ను ప్రశంసించారు.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' తెరకెక్కుతుంది. ఈ సినిమాను మొదట దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ, కరోనా ప్రభావం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. మళ్లీ సినిమా షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి.


Show Full Article
Print Article
Next Story
More Stories