అభిమానులకి ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్.. వైరల్ గా మారిన లెటర్ !

అభిమానులకి ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్.. వైరల్ గా మారిన లెటర్ !
x
Jr.NTR (file photo)
Highlights

టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రం నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుందని అందరు భావించారు.

టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రం నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుందని అందరు భావించారు. కానీ ఫాన్స్ ఆశలపై మేకర్స్ నీళ్ళు చల్లారు. లాక్ డౌన్ వలన పనులన్నీ అపేశామని, దీనివల్ల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సప్ రైజ్ చేయడానికి ఎలాంటి ప్లాన్ చేయలేదని ట్విట్టర్ వేదికగా RRR టీం వెల్లడించింది. దీనితో అభిమానులు నిరశాకి గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే అభిమనులకి ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ లెటర్ రాసాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రియమైన అభిమాన సోదరులకు విన్నపం

" ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడతాం అని నమ్ముతున్నాను. ప్రతి ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి.

అలాగే, RRR చిత్రం నుండి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ విడుదల కావటంలేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశ కు గురిచేసిందని నేను అర్ధం చేసుకోగలను. ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు.

రాజమౌళి గారి దర్శక్వంలో ఎంతో ప్రతిష్టాత్మకం గా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ" అని ఎన్టీఆర్ తెలిపారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories