
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నటుడు హరి కిషన్ తుదిశ్వాసవిడిచారు.
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నటుడు హరి కిషన్ తుదిశ్వాసవిడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన వయసు 57 ఏళ్లు. ఈయన తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్నార్ మొదలుకొని అలనాటి హీరోలతో పాటు ఆ తర్వాత తరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, of మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి హీరోల గొంతులను అనుకరించి మైమరిపించారు. అంతేకాదు ఈయన తెలుగు రాష్ట్రాల్లో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, వైయస్ఆర్ వంటి అగ్ర రాజకీయ నాయకుల గొంతులను మిమిక్రీ చేసి శభాష్ అనిపించారు.
మిమిక్రీ కళాకారుడిగా దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ప్రముఖ నటుడు శివారెడ్డికి ఈయన గురువు కూడా. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని చెప్పాలి. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు
తన మిమిక్రీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హరికిషన్.. మే 30, 1963 తేదీన శ్రీమతి రంగమణి, వి ఎల్. ఎన్ చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించారు. అంతేకాదు చిన్ననాటినుంచి 8 ఏళ్ల వయసులోనే తన గురువులను తోటి వాళ్ల గొంతులను మిమిక్రీ చేయడాన్ని ప్రారంభించారు. అలా ప్రారంభమైన హరికిషన్ ప్రస్థానం ఆ తర్వాత సినీ నటులు, గాయకులు, క్రికెట్ కళాకారులు, రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ పాపులర్ అయ్యారు. అంతేకాదు మిమిక్రీలో తన కంటూ ప్రత్యేక పేజీలు రాసుకున్నారు.
కేవలం మిమిక్రీ మాత్రమే కాదు పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో పలకించడం హరి కిషన్ ప్రత్యేకత. 1971లో తొలిసారి విజయవాడలో మిమిక్రీ ప్రదర్శన చేసారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు తన మిమిక్రీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హరికిషన్.. మే 30, 1963 తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించారు. అంతేకాదు చిన్నప్పటడే 8 ఏళ్ల వయసులోనే తన గురువులను తోటి వాళ్ల గొంతులను మిమిక్రీ చేయడాన్ని ప్రారంభించారు హరికిషన్. 1971లో తొలిసారి విజయవాడలో మిమిక్రీ ప్రదర్శన చేసారు._
అలా ప్రారంభమైన హరికిషన్ మిమిక్రీ ప్రస్థానం... ఆ తర్వాత సినీ నటులు, గాయకులు, క్రికెట్ కళాకారులు, రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ పాపులర్ అయ్యారు. అంతేకాదు మిమిక్రీలో తన కంటూ ప్రత్యేక పేజీలు రాసుకున్నారు. కేవలం మిమిక్రీ మాత్రమే కాదు పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో పలకించడం హరి కిషన్ ప్రత్యేకత. . ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. మిమిక్రీ కళాకారుడిగా దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ప్రముఖ నటుడు శివారెడ్డికి ఈయన గురువు కూడా. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని చెప్పాలి. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




