Drugs Case: సినీతారల డ్రగ్స్ కేసులో రేపటి నుంచి విచారణ ప్రారంభం

Tollywood Drugs Case Investigation Starts From Tomorrow
x

రేపటి నుంచి సినీ తరాల డ్రగ్స్ కేసు విచారణ (ఫైల్ ఇమేజ్)

Highlights

Tollywood Drugs Case: సినీతారల డ్రగ్స్ కేసులో రేపటి నుంచి విచారణ ప్రారంభంకానుంది.

Tollywood Drugs Case: సినీతారల డ్రగ్స్ కేసులో రేపటి నుంచి విచారణ ప్రారంభంకానుంది. రేపు ఈడీ ముందు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హాజరుకానున్నారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ 62 మందిని విచారించింది. డ్రగ్స్‌ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్ మెంట్ క్రైం ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలు చేశారు ఈడీ అధికారులు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసులు నమోదయ్యాయి. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తి్స్తే ఫెమా కేసులు నమోదు చేసే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపటి నుండి సెప్టెంబర్ 22 వరకు సినీ తారలను విడతల వారీగా ప్రశ్నించి విచారణలో అంశాల ఆధారంగా సోదాలు లేదా అరెస్ట్‌ చేసే ఛాన్స్ అవకాశం ఉన్నట్లు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories