Top
logo

'పుష్ప' షూటింగ్ ప్రారంభానికి 'సుకుమార్ మాస్టర్' ప్లాన్స్

Highlights

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల మార్చ్ నెలలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది.

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల మార్చ్ నెలలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దాని వల్ల చాలా చిత్రాలు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి.. కొన్ని థియేటర్లు మూసివేయటం కారణంగా రిలీజ్ నోచుకోలేదు. షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో చితా పరిశ్రమలోని పేద కళాకారుల ఆర్ధిక పరిస్థితి తెబ్బతిన్నయై. అయితే రాష్ట్రంలో డౌన్ అమలులో ఉన్నపటికీ సడలింపులు ఇస్తున్న ప్రభుత్వం త్వరలోనే షూటింగ్స్ మొదలు పెట్టడానికి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ 'పుష్ప' మూవీ షూటింగ్ పై తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారని సమాచారం.

షూటింగ్స్ మొదలైనా కూడా కరోనా పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో ఉన్న భయాలు తొలగిపోయేలా కనిపించడం లేదు. అందుకే అందరిలో ధైర్యం నింపేలా 'ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్' ఉపయోగించనున్నారట సుకుమార్. ఆగ‌స్ట్ నెల నుండి పుష్ప‌ షూటింగ్ మొదలు పెట్టేసి ఈ మెథడ్ అప్లై చేయనున్నారట. ఇందులో భాగంగా మొదటగా నెల రోజుల పాటు ప‌రిమిత సంఖ్య‌లో యూనిట్ స‌భ్యుల‌ను అల్లో చేసి షూటింగ్‌ స్టార్ట్ చేస్తార‌ట‌. ఆ స‌మ‌యంలో స‌భ్యులంద‌రూ ఓ ప్రాంతంలోనే ఉండేలా చూస్తూ.. వాళ్ళెవరూ ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం, అదేవిధంగా ఇత‌రులు వీలున్న ప్ర‌దేశానికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవడం లాంటివి చేస్తారట. ఈ ప్లాన్ వర్కవుట్ అయిందంటేనే త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తార‌ట. అందుకే అందరిలో ధైర్యం నింపేలా 'ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్' ఉపయోగించనున్నారట డైరెక్టర్ సుకుమార్.

ఆగష్టు నుండి 'పుష్ప' చితం షూటింగ్ మొదలు పెట్టి ఈ మెథడ్ ని ఉపయోగించనున్నారని సమాచారం. మొదటగా ఈ నెలలో పరిమిత సంఖ్యలో యూనిట్ సభ్యులను అనుమతించి.. షూటింగ్స్ స్టార్ట్ చేయడం.. అదే విధంగా సభ్యులందరూ కూడా ఒకే ప్రాంతంలో ఉండేలా చూసుకుంటూ.. యూనిట్ సభ్యులు ఇతరులను కలవకుండా చూసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా ఇతరులు షూటింగ్ జరిగే ప్రదేశానికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్ర పోషించగా, పల్లెటూరు అమ్మాయి పాత్రలో రష్మిక నటించనుంది. ఇటీవలే దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది.

Web TitleTollywood Director Sukumar New Plan For Pushpa Movie Shooting
Next Story