బడ్జెట్ విషయంలో పొదుపు పాటించాల్సిందే : రాజమౌళి

బడ్జెట్ విషయంలో పొదుపు పాటించాల్సిందే : రాజమౌళి
x
SS Rajamouli (File Photo)
Highlights

బాహుబలి సినిమాతో టాలీవుడ్ రూపురేఖలు మార్చేశాడు దర్శకధీరుడు రాజమౌళి...

బాహుబలి సినిమాతో టాలీవుడ్ రూపురేఖలు మార్చేశాడు దర్శకధీరుడు రాజమౌళి... భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడమే కాకుండా మార్కెట్ ను సైతం పెంచాడు రాజమౌళి.. రాజమౌళి ఇచ్చిన ధైర్యంతో సైరా, సాహో లాంటి చిత్రాలు పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో యావత్ సినిమా ప్రపంచమంతా అతలాకుతలం అయింది.

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్రం లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాల వారు భారీగానే నష్టపోయారు. అందులో ఒకటి సినిమా ఇండస్ట్రీ కూడా.. అయితే రేపటి పరిస్థితులు మళ్ళీ పూర్వ వైభవంలోకి రావాలంటే బడ్జెట్ విషయంలో కానీ.. రెమ్యునరేషన్ విషయంలో కానీ ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే బడ్జెట్ కంట్రోలింగ్ విషయంపై దర్శకధీరుడు రాజమౌళి తాజాగా స్పందించారు.

లాక్ డౌన్ ప్రభావంతో ఇండస్ట్రీ బాగా నష్టపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాలనీ, ప్రొడక్షన్ విషయంలో కాకుండా రెమ్యునరేషన్స్ పరంగా కూడా తీసుకుంటే సినిమా ఔట్ పుట్‌పై ప్రభావం పడకుండా ఉంటుందనీ రాజమౌళి పేర్కొన్నాడు. ఏ సినిమా అయినా కూడా ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్ సూత్రాలు అయితే పాటించాల్సిందేనని కొన్ని రోజులు ఇది తప్పదనీ రాజమౌళి వెల్లడించాడు.

ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమానీ డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories