Rambabu: ప్రివ్యూ చూస్తుండగా బ్రెయిన్‌ స్ట్రోక్‌.. దర్శకుడు మృతి!

Rambabu: ప్రివ్యూ చూస్తుండగా బ్రెయిన్‌ స్ట్రోక్‌.. దర్శకుడు మృతి!
x

Rambabu: ప్రివ్యూ చూస్తుండగా బ్రెయిన్‌ స్ట్రోక్‌.. దర్శకుడు మృతి!

Highlights

Rambabu: ఈ నెల 18న విడుదలకానున్న బ్రహ్మాండ సినిమాకు దర్శకత్వం వహించిన రాంబాబు మృతి… సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం

Rambabu: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రివ్యూ చూస్తుండగానే దర్శకుడు సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు (47) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రాంబాబు మరణవార్త తెలిసిన వెంటనే చిత్రబృందం, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన, తెలంగాణ ఒగ్గుకథ నేపథ్యంలో రూపొందిన ‘బ్రహ్మాండ’ చిత్రానికి రాంబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 18న విడుదల కావాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా ప్రివ్యూ కార్యక్రమం జరిగింది. అదే సమయంలో రాంబాబు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో, చిత్ర యూనిట్ వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది.

రాంబాబు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు భార్య సరిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు స్వస్థలమైన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం, అల్లీపూర్లో నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. బ్రహ్మాండ నిర్మాత దాసరి సురేశ్, నటులు బలగం జయరాం, ఆనంద్ బాల్సద్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు ఓదార్పు చెప్పారు.

రాంబాబు గతంలో దాదాపు 150 సినిమాలకు, 60 సీరియళ్లకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’, ‘అన్వేషణ’ వంటి సీరియళ్లకు ఆయన సహ దర్శకుడిగా సేవలందించారు. ఓ సుదీర్ఘ ప్రయాణం చేసిన తరం వ్యక్తి, తనే దర్శకత్వం వహించిన చిత్ర విడుదలకు ముందు అకాలంగా తుదిశ్వాస విడిచిన ఈ ఘటనపై చిత్రసీమ దుఖితమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories