రాత్రి 9 గంటలకు వర్మ చేసిన పనికి నెటిజన్లు షాక్.. పిచ్చి పీక్స్ అంటూ ట్వీట్స్

రాత్రి 9 గంటలకు వర్మ చేసిన పనికి నెటిజన్లు షాక్.. పిచ్చి పీక్స్ అంటూ ట్వీట్స్
x
Ramgopal Varma (File Photo)
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే.. ఇటీవలే కరోనాపై ఒక సాంగ్ రాసి పాడిన వర్మ తాజాగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో యావత్భారతం స్పందించింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో 9 గంటలకు ముందుగానే తమ ఇళ్లలో లైట్లు ఆపేశారు. వెంటనే మట్టి ప్రమిదలో నూనె ఒత్తులతో కూడిన దీపాలు వెలిగించారు. కొందరు కొవ్వొత్తులు వెలిగించారు, మరికొంత మొబైల్ టార్చ్ లైట్స్ ఆన్ చేశారు. కరోనా వైరస్ పోరాటంలో భారత జాతి మొత్తం ఒక్క తాటిపై ఉందన్న సందేశాన్ని పెద్ద ఎత్తున చాటిచెప్పారు. కొందరు మంత్రాలు పఠిస్తే మరికొందరు జాతీయ గీతాన్ని ఆలపించారు.

కరోనపై పోరాటంలో భాగంగా సామూహిక శక్తిని చాటిచెప్పాలని ప్రధాని పిలుపు చిత్రసీమ కదలివచ్చింది. అందరూ దీపాలు వెలిగిస్తే అర్జీవి మాత్రం రాత్రి 9 గంటలకు అందిరిలా కాకుండా చాలా స్పెషల్ గా చేశారు. ప్రతి దాన్ని కాంట్రవర్సి చేయడం వర్మకు అలవాటే. దీపాలు, క్యాండిల్స్ కాకుండా లైటర్ వెలిగించి దానితో సిగరెట్ వెలిగించాడు. దానిని వీడియో తీసి తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొన్ని సెకన్ల పాటు ఉన్న ఆ వీడియోను చూసిన నెటిజన్లు వర్మ చేసిన పనిపై కూడా సెటైర్లు వేస్తున్నారు.

తిక్క మామూలుగా లేదంటూ.. ఓ నెటిజన్ విమర్శింస్తే... మరో నెటిజన్ 9 నిమిషాలు అలాగే ఉంచాలన్నాడు. కరోనా పై ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. సిగరెట్ తాగడంపై ప్రభుత్వ హెచ్చరికను పాటించకపోవడం కంటే.. కరోనా వైరస్ పై ప్రభుత్వ హెచ్చరిలకు పాటించకపోవడం చాలా ప్రమాదకరమని. ట్వీట్ చేశాడు. నెటిజన్స్ కొందరు వర్మ చేసిన పనిని లైట్ తీసుకున్నారు. చాలామంది వర్మపై విమర్శలు చేశారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories