పాత్రల పరంగా చూస్తే వారికి విజయం లేదు : రాజమౌళి ట్వీట్

పాత్రల పరంగా చూస్తే వారికి విజయం లేదు : రాజమౌళి ట్వీట్
x
Rajamouli Tweets on Amrutham 2
Highlights

అమృతం సిరీయల్ తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఇద్దరు స్నేహితులు, ఇంటి ఓనర్ వారితో కలిసి అమృతం అనే ఆ హోటల్ సర్వర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

అమృతం సిరీయల్ తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఇద్దరు స్నేహితులు, ఇంటి ఓనర్ వారితో కలిసి అమృతం అనే ఆ హోటల్ సర్వర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. వీరంతా పండించిన కామెడీ అభిమానులకు పొట్టచెక్కలైయ్యేలా నవ్వించింది. అయితే అప్పట్లో వచ్చిన ఈ సిరియల్ బుల్లితెర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటికి ఆ పాత్ర దారులు ఏ సినిమాలో కనిపించిన వారిని అమృతం సిరియల్ లోని పాత్రల పేరుతోనే పిలుస్తారు. అమృతం సిరియల్ కి పోటీగా వచ్చిన సిరీయల్ ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేకపోయాయి. తాజా ఈ నెల 25 నుంచి అమృతం సిరీయల్ ద్వితీయార్థం రాబోతోంది. అమృతం ముర్ఖత్వానికి మరణం లేదు అనే ట్యాగ్ లైన్ తో రాబోతుంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి అమృతంపై స్పందించారు. ఎన్ని సీరియళ్లు ఉన్నా 'అమృతం' కామెడీ సీరియల్ స్థానం ఇప్పటికీ పదిలం అన్నారు. హాస్యంతో, కడుపుబ్బా నవ్వించే "19 ఏళ్ల కిందట కన్నీరు తెప్పించే టీవీ సీరియళ్లు రాజ్యమేలుతున్న తరుణంలో, ఇలా కూడా సీరియల్ ఉండొచ్చు రంగంలోకి దిగిన ఒకే ఒక్కడు 'అమృతం'. టీవీ సీరియల్ రూల్సును మార్చి ఆ ఒక్కడు సాగించిన 'అమృతం'. 5 సార్లు టెలివిజన్ చానళ్లలో రిపీటైన ఒకే ఒక్క సీరియల్, 270 మిలియన్ వ్యూస్ సాధించిన సీరియల్, 'అమృతం' మాత్రమే.

అంజి, అమృతం పాత్రల పరంగా చూస్తే ఎప్పటికీ విజయం సాధించనప్పటికి వాళ్ల సీరియల్ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. 'అమృతం' సీరియల్‌కు సీక్వెల్ తీయాలని కోరిన అభిమానుల కోరిక తీరుతోంది. ఎట్టకేలకు ఈ ఉగాది నుంచి 'అమృతం ద్వితీయం' వచ్చేస్తోంది" ముర్ఖత్వానికి మరణం లేదు అంటూ రాజమౌళి ట్వీట్లు చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories