కరోనాపై 'అ!'డైరెక్టర్ సినిమా

కరోనాపై అ!డైరెక్టర్ సినిమా
x
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. దీని ప్రభావంతో సినిమా షూటింగులు నిలిచిపోయాయి.

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. దీని ప్రభావంతో సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు హీరోలు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు తీస్తుంటే. మరికొందరు పాటల రూపంలో జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక ఇండస్ట్రీలోని దర్శకులు అయితే కొత్త స్క్రిప్టులకు పనిచెబుతున్నరు. కాగా.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌( కోవిడ్ 19)పై సినిమా తీయడానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీల దర్శకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

తెలుగులో కరోనా వైరస్ పై యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సినిమా తెరకెక్కించబోతున్నరని టాక్. '2019 డిసెంబరులో కోవిడ్ వ్యాప్తి చెందుతున్నట్లు తెలిసిన తర్వాత ప్రశాంత్‌ స్క్రిప్టు పనులు మొదలు పెట్టారని సమాచారం. ఈ మేరకు ఆయన పరిశోధనలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే నటీనటుల్ని కూడా ఎంపిక చేస్తారంట. ఈ సినిమా నిర్మాణంలో ప్రశాంత్‌ భాగస్వామ్యం వహించబోతున్నారని పరిశ్రమ వర్గాలలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి కరోనా ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఈ సినిమా షూట్‌ ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై ప్రశాంత్‌ ఇంకా స్పందించలేదు. కరోనా వైరస్‌పై సినిమాలు తీయడానికి పలు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే ఇప్పటికే టైటిల్స్‌ను కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ అ!' చిత్రంతో ఆయన టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

ఈ సినిమాలో కాజల్‌, నిత్యా మేనన్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌, ప్రియదర్శి కీలక పాత్రల్లో పోషించిన ఈ సినిమా మంచి విజయం లభించింది. ఉత్తమ మేకప్‌ విభాగంలో జాతీయ అవార్డు సాధించింది. నాని నిర్మాతగా వ్యవహరించారు. దీనికి సీక్వెల్‌ మరో చిత్రాన్ని రూపొందించాలి అనుకున్నారు. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, 'అ!' ఫ్రాంచైజ్‌ను కొనసాగిస్తామని ప్రశాంత్‌ చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories