పవర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మెగా డైరెక్టర్

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మెగా డైరెక్టర్
x
Pawan Kalyan, Harish Shankar (file Photo)
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే వీరి కాంబినేషన్లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవ్వాలని కోరుకొని అభిమాని ఉండడు..అయితే మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఇది పవన్ కళ్యాణ్ కి 28వ చిత్రం కావడం విశేషం..

గతేడాది హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ తాజాగా హరీష్ శంకర్ దీనిపైన క్లారిటీ ఇచ్చాడు.. ప్రస్తుతం తాను ఓ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నానని ఆ తర్వాత నిర్మాతలు మహేష్ ఎస్ కొనేరు, బన్నీ వాస్‌లతో సినిమాలు చేస్తానని అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నానని చెప్పారు. దీనిబట్టి చూస్తే హరీష్ శంకర్ తన తదుపరి చిత్రం పవన్‌తో కాదు మహేష్ బాబుతో ఉంటుందని తెలుస్తోంది.

ఇక సందర్భంగా పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి స్పందించారు. తానెప్పుడూ ఓ డైరెక్టర్‌ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్‌ని చూడనని, ఓ ఫ్యాన్‌గా మాత్రమే చూస్తానని హరీష్ వెల్లడించారు. ఆ సినిమా పవర్ స్టార్ అభిమానులు కోరుకునే విధంగా ఉంటుందని, ఆ సినిమా పవన్ అభిమానులు ఆయనను మరింతగా ఆరాధిస్తారని వెల్లడించారు హరీష్ శంకర్.. ఇక ఆటు పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ గా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా బోనికపూర్ దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories