బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ కమెడియన్..?

బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ కమెడియన్..?
x
Highlights

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో టాలీవుడ్ చెందిన ఓ కమెడియన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో టాలీవుడ్ చెందిన ఓ కమెడియన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. రూలర్ సినిమా తర్వాత విరామం తీసుకున్న బాలయ్యా.. బోయపాటి సినిమా కోసం అప్పుడే కసరత్తులు ప్రారంభించారు. సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లో వచ్చారు. ఈ సినిమా బరువు కూడా భారీగానే తగ్గిపోయారు.

ప్రయోగాలు చేయడంలో అందరి కంటే బాలయ్య ఎప్పుడూ ఉంటారు. రూలర్ చిత్రం కోసం దాదాపు 11కిలోల బరువు తగ్గిన బాలయ్య తాజాగా మరో 10 కేజీలు తగ్గారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించే వారు ఎవరనేది మొదటి నుంచి ఆసక్తిగా మారిపోయింది చాలా కాలం గ్యాప్ తీసుకొని జగపతిబాబుకు . లెజెండ్ సినిమాతో విలన్ గా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రంలో జగపతి బాబు మంచి మార్కులే కొట్టేశాడు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా చేయగలరని నిరుపించారు. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ సారి బాలయ్యతో సినిమా కోసం కొత్త విలన్‌ను చూపించాలని బోయపాటి ఫిక్సైపోయారని తెలుస్తోంది.

మొదట ఈ సినిమాలో రాజశేఖర్ పేరును విలన్ పాత్రకు పరిశీలించినట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం కమెడియన్ సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నారని టాక్. సూనీల్ చేయబోయేది విలన్ గా నటించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

‎రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం డిస్కో రాజా. ఈ సినిమాలో సునీల్ విలన్ పాత్రలో నటించారు. సునీల్ విలన్ క్యారెక్టర్ లోనూ మెప్పించారు. కానీ బాలయ్య సినిమాలో విలన్‌‌గా నటిస్తే ఇక మరోలా ఉండనుంది. బోయపాటి సినిమా విలన్ పాత్ర అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకూ కమెడీయన్, హీరోగా చేసిన సునీల్ కెరీర్ విలన్‌గాను ఊపందుకోవడం ఖాయం


Show Full Article
Print Article
More On
Next Story
More Stories