Top
logo

న‌టి ఫిర్యాదు.. శ్యామ్ కె.నాయుడు అరెస్ట్..

న‌టి ఫిర్యాదు.. శ్యామ్ కె.నాయుడు అరెస్ట్..
X
Highlights

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.నటి సాయి సుధను మోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.. సాయి సుధా ఫిర్యాదు మేరకు శ్యామ్ కె. నాయుడుని అరెస్టు చేశారు. నటి సాయి సుధా 'అర్జున్ రెడ్డి' చిత్రంలో నటించారు. మీడియా కథనాల ప్రకారం, సుధా నాయుడుపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. శ్యామ్ కె. నాయుడు తన తనను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి.. ఇప్పుడు మొహం చాటేశాడని సుధా ఆరోపించింది. శ్యామ్ కె నాయుడుతో గ‌త ఐదేళ్లుగా ప‌రిచ‌యం ఉంద‌ని, 2015 నుంచి లివ్ ఇన్ రిలేష‌న్ షిప్‌లో ఉన్నామ‌ని తెలిపారు. ఈ విష‌యం అత‌ని ఇంట్లో కూడా తెలుసని చెప్పారామె.

Web TitleTollywood Cinematographer Shyam K Naidu was taken into custody by Hyderabad police
Next Story