ఫిబ్రవరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

ఫిబ్రవరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్
x
february 2020 Tollywood movies report (File photo)
Highlights

ఈ ఏడాది మొదటినేల జనవరిలో బాక్స్ ఆఫీస్ కి మంచి కలెక్షన్లతో దద్దరిల్లిపోయింది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంటపురములో'

ఈ ఏడాది మొదటినేల జనవరిలో బాక్స్ ఆఫీస్ కి మంచి కలెక్షన్లతో దద్దరిల్లిపోయింది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంటపురములో' చిత్రాలు మంచి విజయాన్ని అందుకొన్ని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డులను అందుకున్నాయి. ఇక ఆ తరవాత వచ్చిన సినిమాలు ఆ జోరును కనబరచలేకపోయిన పర్వాలేదు అనిపించాయి. ఇక ఫిబ్రవరి నెలలో ఆకట్టుకున్న చిత్రాలు ఏంటో చూద్దాం..

జాను :

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. తమిళ చిత్రం '96'కు రీమేక్‌గా తెరకేక్కడం, శర్వానంద్‌, సమంత కీలక పాత్రల్లో నటించడంతో సినిమాపైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోగలిగింది. కానీ ప్రేమికులకి ఓ మంచి చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ :

జాను తర్వాత ఈ నెలలో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ తో నలుగురు హీరోయిన్స్, భారీ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులకు రుచించలేదు. కానీ దర్శకుడు క్రాంతిమాధ‌వ్ రచయితగా ఆకట్టుకున్నాడు. క్రియేటివ్ కమర్షియల్ ఈ సినిమాని నిర్మించింది.

భీష్మ :

నితిన్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆధ్యంతం హాస్యంతో సినిమా సాగడంతో ప్రేక్షకులు సినిమాని పెద్ద హిట్ గా మలిచారు. ఇక ఫిబ్రవరిలో బాక్సాఫీస్‌ కింగ్‌ గా ఈ చిత్రం నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది.

హిట్‌ :

విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాని నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకి తగ్గట్టుగా సినిమా ఉండడం, థ్రిల్లర్ అంశాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులకి బాగానే కనెక్ట్ అయింది.

ఇక ఈ నెలలో నీవల్లే నీవల్లే, సవారీ, త్రీ మంకిస్, డిగ్రీ కాలేజ్ , లైఫ్ అనుభవించు రాజా, ఒక చిన్న విరామం, హీరో హీరోయిన్, చీమ ప్రేమ మధ్యలో భామ, ప్రెజర్‌ కుక్కర్‌ మొదలగు చిత్రాలు నిలిచినప్పటికీ ఆశించిన విజయాలను సాధించలేకపోయాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories