తాప్సీ తిట్టమంటుంది.. మీరు రెడీనా?

తాప్సీ తిట్టమంటుంది.. మీరు రెడీనా?
x
Tapsee Pannu (File Photo)
Highlights

సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కే పరిమితమైపోయింది పంజాబీ బ్యూటీ తాప్సి.

సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కే పరిమితమైపోయింది పంజాబీ బ్యూటీ తాప్సి. బాలీవుడ్ లో భిన్నమైన సినిమాలు చేస్తూ.. ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించింది. అయితే సౌత్ ఇండస్ట్రీలో నటించే అవకాశం వస్తే తను వదులుకోనంటోంది. కానీ, ఇప్పటికీ సౌత్ నుంచి వచ్చే ఛాన్సుల్లో 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయంటోంది. అందుకే సౌత్ లో సినిమాలు చేయడం లేదని స్పష్టంచేసింది.

"సౌత్ లో 2019లో గేమ్ ఓవర్ మూవీ చేశాను. అది తెలుగు-తమిళ భాషల్లో విడుదలైంది. సౌత్ లో ప్రతి ఏటా ఓ సినిమా చేయాలనుకుంటాను. కానీ సమస్య ఏంటంటే.. ఎక్కువగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేయడం వల్ల 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమా ఆఫర్లే అవి. అయినప్పటికీ అలాంటివి చేయను."

అలా అని కథ మొత్తం తానే ఉండాలని అను కోవడం లేదని తెలిపింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ తన పాత్రకు గుర్తుండి పోయేలా ఉండాలని అంటోంది ఈ బ్యూటీ. ఇక ట్రోలింగ్స్ పై స్పందిస్తూ.. ట్రోలింగ్స్ ను ఎంజాయ్ చేస్తానంటోంది.

"నన్ను ట్రోల్ చేస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనలో మేటర్ ఉన్నప్పుడే కదా మనల్ని ట్రోల్ చేస్తారు. మనపై అందరి దృష్టి ఉంటేనే కదా మనం ట్రోలింగ్ కు గురవుతాం. కాబట్టి అది ఎంజాయ్ చేయాల్సిన విషయమే. అందరూ నన్ను తిడుతున్నారంటే నా జీవితంలో విషయం ఉన్నట్టే కదా." లాక్ డౌన్ ముగిసిన వెంటనే మ ఓ జపనీస్ రెస్టారెంట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాలనుకుంటోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories