Top
logo

ఆర్ఆర్ఆర్ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?

ఆర్ఆర్ఆర్ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?శ్రియా సరన్..ఆర్ఆర్ఆర్
Highlights

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్".

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్". బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఆ హీరోయిన్ రాజమౌళి సినిమాలో చేసిన వారే కావడం విశేషం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి సినిమాలో ఆమె హీరోయిన్ గా చేశారు. ఆమె ఎవరో కాదు ఒప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రియా సరన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియా మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు టాక్. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ సరసన శ్రియ నటిస్తున్నారని తెలుస్తోంది. శ్రియ అజయ్ దేవగన్ జంటగా నటించడం ఇది రెండో సారి కావడం విశేషం. గతంలో దృశ్యం చిత్రంలో అజయ్ సరసన శ్రియ నటించారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో కూడా రెండో సారి శ్రియ నటిస్తున్నారు. శ్రియ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే శ్రియ నటిస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించలేదు.

ఇక ఈ సినిమాలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా హాలీవుడ్ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని జూలై 30న భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రాలలో కనిపించనున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Web TitleTollywood Actress Shriya Saran In RRR Movie

లైవ్ టీవి


Share it
Top