Hamsa Nandini: ప్రముఖ సినీ నటి హంసానందినికి క్యాన్సర్

Sandeep Reddy
Updated on: 20 Dec 2021 11:26 AM IST
Tollywood Actress Hamsa Nandini Opens up About her Cancer Diagnosis
X

Hamsa Nandini: ప్రముఖ సినీ నటి హంసానందినికి క్యాన్సర్ 

Hamsa Nandini: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా, ఐటెం గర్ల్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన హంసానందిని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా హంసానందిని ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తను క్యాన్సర్ తో పోరాడుతున్నానని చెప్పి షాకిచ్చింది హంసానందిని. సుమారుగా నాలుగు నెలల క్రితం తన బ్రెస్ట్ లో లంప్ ఉన్నట్లుగా గుర్తించిన హంసానందిని వెంటనే డాక్టర్స్ ని కలిసి పలు టెస్ట్ లు చేయించుకోగా బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలిందని చెప్పుకొచ్చింది.

18 ఏళ్ళ క్రితం తన తల్లి కూడా క్యాన్సర్ తో మరణించిందని.. ఇప్పుడు తనకు కూడా క్యాన్సర్ వచ్చిందని ఎమోషనల్ అయిన హంసానందిని..ఈ క్యాన్సర్ తో పోరాడి గెలుస్తానని నమ్మకముందని తెలిపింది. ప్రస్తుతం కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకుంటున్నట్లుగా తెలిపింది. ఇప్పటికి 9 సైకిల్స్ పూర్తయ్యాయని.. మరో 7 సైకిల్స్ ఉన్నట్టు తెలిపింది. తనకొచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా తగ్గే అవకాశాలు తక్కువని భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story