టాలీవుడ్‌లో 'అల్లూరి' సీతారామరాజులు'.. మూడు సినిమాల్లో కనిపించిన బాలయ్య

Alluri Seeta Rama Raju
x

Alluri Seeta Rama Raju

Highlights

Alluri Seeta Rama Raju: స్వాతంత్ర్య యోధుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితగాథ తెలుగువారికి విధితమే

Alluri Seetarama Raju: స్వాతంత్ర్య యోధుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితగాథ తెలుగువారికి విధితమే. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. ఇలాంటి అల్లురి నిజజీవిత కథ ఆధారంగా తెలుగు సినిమాలు వచ్చాయి. తాజాగా రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ సినిమాలోనే చెర్రీ అల్లూరిగా కనిపించారు.

అంతకుముందు టాలీవుడ్ లో అల్లురి పాత్రలో కృష్ణ, ఎన్టీఆర్, మహేశ్ బాబు, బాలకృష్ణ కనిపించారు. బాలకృష్ణ అయితే ఏకంగా మూడు చిత్రాల్లో అల్లూరి సీతారామరాజుగా కనిపించి సందడి చేశారు. 'భారతంలో బాలచంద్రుడు', 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ , విజేంద్రవర్మ సినిమాలో క్లైమాక్స్ వచ్చే ఫైట్ లో బాలయ్య అల్లూరిగా కనిపించారు. ఇక ఆపాటలో ఆయన విశ్వరూపం చూపించారు.

'ఆలు మగలు' చిత్రంలో జగ్గయ్య అల్లూరి పాత్రలో కనిపించారు. అల్లూరి సీతారామరాజు పాత్రపై మనసుపడ్డ వ్యక్తి ఎన్టీఆర్‌. 1950లోనే అల్లూరి సీతారామరాజుగా కనిపించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పడు ఆ సినిమా నిలిచిపోయింది. సీతారామరాజు పాత్ర చేయడం సాధ్యపడలేదు. పరుచూరి బ్రదర్స్‌ పిలిపించి ఆ పాత్రకు కథ సిద్ధం చేయమని కోరగా.. 'కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చూడాలని వారు ఎన్టీఆర్ కు సూచించారు. ఆ సినిమా చూసిన ఎన్టీఆర్ అల్లూరి పాత్రతో సినిమా తీయాలనే ఆలోచన విరమించుకున్నారు. అయితే ఆ పాత్రపై మక్కువ మాత్రం అలానే ఉంది. దీంతో 'సర్దార్‌ పాపారాయుడు', 'మేజర్‌ చంద్రకాంత్‌' చిత్రాల్లోని పాటల్లో అల్లూరి గెటప్‌ వేసి, కోరికను నెరవేర్చుకున్నారు.

అల్లూరి సీతారామరాజు అంటే ప్రజల మదిలో మెదిలేది మొదట సూపర్‌స్టార్‌ కృష్ణ. అంతలా 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో ఒదిగిపోయి నటించారాయన. వి.రామచంద్రరావు దర్శకత్వంలో 1974 మే 1 విడుదలైన 'అల్లూరి సీతారామరాజు'రికార్డులు బద్దలు కొట్టింది. థియేటర్లలో ఆఖరి ఘట్టంలో కృష్ణ డైలాగ్‌లు ప్రేక్షకుడి నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగిపోయింది. మహేశ్‌బాబు తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాలనటుడిగానే టాలీవుడ్ లో తనదైన ముద్రవేశారు. 1988లో కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'ముగ్గురు కొడుకులు' చిత్రంలో మహేశ్‌బాబు నటించారు. అల్లూరి సీతారామరాజుగా మహేశ్ అదరగొట్టాడు.

విశేషం ఏమిటంటే రెండు కుటుంబాలకు చెందిన నలుగురు అల్లూరి సీతారామరాజుగా సందడి చేశారు. తండ్రి కొడుకులు ఎన్టీఆర్, బాలకృష్ణ అల్లూరిగా కనిపిస్తే.. కృష్ణ ఆయన కొడుకు మహేశ్ బాబు కూడా అల్లూరిగా కనిపించారు. మొత్తానికి ఎన్టీఆర్ రెండు సార్లు, బాలయ్య మూడు సినిమాల్లో కనిపించగా.. కృష్ణ, మహేశ్ బాబు ఒక్కొక్క సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించి మెప్పించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories