రానా, రామ్‌చరణ్‌ డబ్‌స్మాష్‌ వీడియో నెటింట్లో వైరల్

రానా, రామ్‌చరణ్‌ డబ్‌స్మాష్‌ వీడియో నెటింట్లో వైరల్
x
Rana Daggubati, Ram Charan (File Photo)
Highlights

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దగ్గుబాటి రానాల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దగ్గుబాటి రానాల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వీరిద్దరూ క్లాస్‌మేట్స్‌ కూడా. ఎప్పటి నుంచో దగ్గుబాటి, కొణిదెల కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం అందరికి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ సమయంలో తమ హీరోలకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్‌ తిరిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రానా, రామ్‌ చరణ్‌లకు సంబంధించిన డబ్‌స్మాష్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. మగధీర చిత్రంలోని 'ఒక్కొక్కరిని కాదు షేర్‌ ఖాన్‌ ఒకేసారి వందమందిని పంపు'అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌కు వీరిద్దరూ డబ్‌ష్మాష్‌ చేశారు.

రానా తన ట్విటర్‌లో 2015లో ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. 'భైరవతో డబ్‌స్మాష్‌' అంటూ కామెంట్‌ జత చేశాడు. ఇక దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. విరాటపర్వం, అరణ్య సినిమాలో రానా ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తాజాగా రానా ప్రేమ విషయంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories