ప్రేమిస్తున్నా అని చెప్తే రాఖీ కట్టింది

ప్రేమిస్తున్నా అని చెప్తే రాఖీ కట్టింది
x
Vishwak Sen (File Photo)
Highlights

'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి 'ఫలక్ నామా దాస్' సినిమాతో హీరోగా, దర్శకుడిగా ప్రతిభ చూపిస్తూ 'హిట్' సినిమాతో నటుడిగా ప్రేక్షకులను మెప్పించారు యువ కథనాయకుడు విశ్వక్ సేన్.

'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి 'ఫలక్ నామా దాస్' సినిమాతో హీరోగా, దర్శకుడిగా ప్రతిభ చూపిస్తూ 'హిట్' సినిమాతో నటుడిగా ప్రేక్షకులను మెప్పించారు యువ కథనాయకుడు విశ్వక్ సేన్. ఆ సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని పక్కనపెడితే హిట్, చిత్రంతో హీరోగా తనకంటూ ఐడెండిటీ సాధించి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. అయితే తన నోటి దురుసు కారణంగా పలు వివాదాస్పద కామెంట్స్‌ కు కేంద్ర బిందువుగా నిలిచాడు.

తాజాగా విశ్వక్ సేన్ ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న టాక్ షోలో తన చిన్న నాటి ప్రేమకథను బయటపెట్టాడు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ షోలో హోస్ట్ చేస్తున్నారు. కాగా ఈ షోలో పాల్గొన్న విశ్వక్ సేన్ తన చిన్ననాటి ప్రేమకథ గురించి నోరువిప్పాడు. సంపాదించావ్.. విశ్వక్ సేన్ ఎనిమిదో తరగతిలోనే ఓ అమ్మాయిని లవ్ చేశాడట.. అయితే ఆమె తనకంటే రెండేళ్లు సీనియర్. ఆమె 10 తరగతి చదువుతోంది. ఆమెను ప్రేమిస్తునట్లు వెళ్లి చేశాడట. ఇంకేం వుంది విషయం టీచర్‌కి తెలియడంతో ఇద్దర్నీ ఆఫీస్ రూంకి పిలిచారట. అక్కడే విశ్వక్ సేన్‌కి ఆ అమ్మాయితో రాఖీ కట్టించరట టీచర్. ఈ చిన్ననాటి లవ్ స్టోరీ బయటకు చెప్పకూడదని అనుకున్నా... ఇదిగో ఇలా బయటకు వచ్చేసిందంటూ తన విశ్వక్ సేన్ ఎనిమిదో తరగతి ప్రేమకథను చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories