Sharwanand: ట్విట్టర్ లోకి శర్వానంద్ ఎంట్రీ.. తొలి పోస్ట్ లోనే 15 లక్షల విరాళం...

Sharwanand: ట్విట్టర్ లోకి శర్వానంద్ ఎంట్రీ.. తొలి పోస్ట్ లోనే 15 లక్షల విరాళం...
x
Sharwanand (File Photo)
Highlights

తమలోని భావాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడానికి సెలబ్రిటీలు ట్విట్టర్ ని వేదికగా ఎంచుకుంటారు.

తమలోని భావాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడానికి సెలబ్రిటీలు ట్విట్టర్ ని వేదికగా ఎంచుకుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా అదే రోజు ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రామ్ చరణ్ తొలి పోస్ట్ లోనే 75 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక తాజాగా హీరో శర్వానంద్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చి తన తొలి పోస్ట్ లోనే కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కార్మి కులకు 15 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఇలాంటి విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేద్దాం.. కరోనా ని ఎదుర్కొని తరిమికొడదాం. ప్రభుత్వం చెప్పిన సూచనలు తప్పక పాటిద్దాం అని శర్వానంద్ పేర్కొన్నారు. ఇక శర్వానంద్ ట్విట్టర్ లో రామ్ చరణ్, చిరంజీవి ఫాలో అవుతూ ఉండగా, శర్వానంద్ ని వెయ్యి మందికి పైగా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు.

ఇక కరోనా వైరస్ రోజురోజుకి విలయ తాండవం ఆడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇక భారత్ లో కూడా క్రమక్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 900 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మంది మృతి చెందారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories