స్కూల్ పిల్లల్లాగే.. వైన్ షాపులు ఓపెన్ పై సినీనటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్కూల్ పిల్లల్లాగే.. వైన్ షాపులు ఓపెన్ పై సినీనటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Actor Naresh(File photo)
Highlights

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు మూతపడిన వైన్ షాపులు.. కేంద్రం విధించిన సడలింపులతో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి.

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు మూతపడిన వైన్ షాపులు.. కేంద్రం విధించిన సడలింపులతో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. సామాజిక దూరం పాటిస్తూ లిక్కర్ కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. మందు షాపుల ముందు బారులు తీరారు మందుబాబులు.

ఆంధ్రప్రదేశ్ సహా మరి కొన్ని రాష్ట్రాల్లోనూ వైన్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో మందు బాబులు హడావిడి అంతాఇంతా కాదు. కొన్ని చోట్ల పటాసులు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారంటే.. మరికొన్ని చోట్ల మాత్రం క్యూ లైన్ పాటిస్తూ లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. నెట్టింట ఎక్కడ చూసినా మందు బాబుల విన్యాసాల వీడియోలే దర్శనమిస్తున్నాయి.

ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన సినీనటుడు నరేష్ షేర్ చేశారు. అనంతపురంలోని కొన్ని వైన్ షాప్స్ తెరిచారు. మొదటి రోజు స్కూల్ కి వచ్చిన పిల్లల్లాగే 6 అడుగుల దూరం పాటిస్తూ మన పౌరులు మాత్రమే ఎంత క్రమశిక్షణతో నిలబడ్డారో చూడండి. మన ప్రజలను చూస్తుంటే గర్వంగా ఉంది. ఉంది అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories