ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం కరోనాపై మెగా ఫ్యామిలీ మెసేజ్


మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా ట్విట్టర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కరోనాపై పోరులో అభిమానులకు ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా ట్విట్టర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కరోనాపై పోరులో అభిమానులకు ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉన్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ మరో సందేశం ఇచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి కరోనా కారణంగా షూటింగ్ లేని కార్మికులను ఆడుకోవడం కోసం తన వంతుగా విరాళం అందజేయడమే కాదు. వేరే హీరోలు ఈ ఛారిటీకి విరాళాలు అందజేసేలా చేశారు. తాజాగా మెగాస్టార్ కుటుంబ సభ్యులందిరితో ఒక ప్లకార్డు పట్టించి ఓ మెసేజ్ ఇచ్చారు. ఇళ్లలోనే ఉంటాం.. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుదాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారీతీయులంతా ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం. స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ మెగా కుటుంబం కదిలింది.
ఈ కార్యక్రమంలో చిరంజీవి నుంచి నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్, వరుణ్ తేజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఆయన సతీమణి ఉపాసన, చిరంజీవి ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రిజతో పాటు మెగాస్టార్ చినల్లుడు కళ్యాణ్ దేవ్,సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ ఈ ప్లకార్డులు పట్టుకున్న వారిలో ఉన్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీకి కలిసి ఈ రకంగా ప్లకార్డులు పట్టుకొని అభిమానులతో పాటు ప్రజలకు కరోనాపై మంచి సందేశాన్నే ఇచ్చారు. ఇటీవలే చిరంజీవి, అమితాబ్ పలువురు నటీనటులు కలిసి ఓ లఘు చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.
Together we WILL WIN this War!
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 15, 2020
Let us STAY where we are.
Let us keep ourselves,our dear ones and the world safe.#SimpleStepsToWinAMightyWar#UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/PXys8AE6JB

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



