హీరోయిన్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన నటుడు బ్రహ్మాజీ

హీరోయిన్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన నటుడు బ్రహ్మాజీ
x
Bramhaji (File Photo)
Highlights

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేయడంతో పాటు షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది..

ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు.

అయితే కరోనా క్రైసిస్‌ ఛారిటీకి హీరోయిన్ల నుండి మద్దతు కరువైంది. హీరోని లావణ్య త్రిపాఠి తప్ప మరి ఎవరు స్పందించక పోవడం గమనార్హం.. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు ఇక్కడ పని చేస్తున్నారని... అయితే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీ కోసం ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories