Tollywood: 31 ఇయర్స్..జగదేకవీరుడు అతిలోకసుందరి

Chiranjeevi movie
x

జగదేకవీరుడు అతిలోకసుందరి

Highlights

Tollywood: తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో విజయాలు వచ్చుంటాయి కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి విజయం మాత్రం కచ్చితంగా వచ్చుండదు

Tollywood: మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం 'జగదేకవీరుడు-అతిలోకసుందరి'. ఈ చిత్రం ఇక 1990లో మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. అతిలోక‌సుంద‌రి శ్రీదేవి ఇంద్రుడి కూతురు ఇంద్ర‌జ‌గా న‌టించి త‌న‌కు సాటిలేద‌ని మ‌రోసారి నిరుపించింది. ఈ సినిమాలోని పాటు ఇప్ప‌టికి మొబైల్ ఫోన్ల‌లో మారుమొగుతుంటాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక తొలి సోషియో ఫాంటసీ చిత్రం ఇదే. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు. ఈ సినిమా విడుదలై నేటికి 31 ఏళ్లు. చరిత్రలో నిలిచిపోవడమే కాదు.. తనే ఓ చరిత్రగా నిలిచిపోయింది ఈ చిత్రం.

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో విజయాలు వచ్చుంటాయి కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి విజయం మాత్రం కచ్చితంగా వచ్చుండదు.చందమామ కథలు ఈ రోజుల్లో ఎవరు చూస్తారు.. ఇక అశ్వినీ దత్ పనైపోయినట్లే. అంతా భావించారు. సినిమా రిలీజ్ రోజు ఎన్నో అడ్డంకులు. అకాల వర్షాలు, కరెంటు లేదు. సినిమా వచ్చినట్టు కూడా జనాలకు తెలియదు. విడుదల రోజు కనీసం థియేటర్స్‌లో ఒక్కడు కూడా లేడు.. అక్కడక్కడా మార్నింగ్ షోలు పడినా కూడా మోకాళ్ళ లోతు నీళ్ళలో చూసారు ప్రేక్షకులు.

ఓ గొప్ప సినిమాను తీసానని మురిసిపోయిన అశ్వీని దత్ కల కళ్ల ముందే నీరుగారి పోతుంటే అంతా ఆయనకు ధైర్యం చెప్తున్నారు.అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీఆర్ కూడా తన రోడ్ షోలో ఓ సారి అశ్వినీ దత్, రాఘవేంద్రరావును కలిసి మీ సినిమా టాక్ బాగుంది. దిగులు పడకండి బ్రదర్.. అంతా సవ్యంగా సాగుతుందని ధైర్యం చెప్పారంట. ఆ తర్వాతగా రెండు వరాల తర్వాత జ్కోతిష్కుడు చెప్పినట్లే తుఫాన్ కంటే ఎక్కువ వసూళ్లను జగదేకవీరుడు అతిలోకసుందరి తీసుకొచ్చింది. 365 రోజులు జగదేకవీరుడు అతిలోకసుందరి ఆడింది

కథ

రాజు (చిరంజీవి) ఒక గైడ్ ఈ సినిమాలో అనాథ పిల్ల‌ల‌ను చెర‌దీసి వారి బాగోగులు చూస్తూ ఉంటాడు చిరంజీవి. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక మూలికతో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామి చెప్పటంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు.

ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా, దారి తప్పి మానససరోవరానికి వస్తాడు. ఒక సంద‌ర్భంలో దేవ‌లోకం నుంచి ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ (శ్రీదేవి) భూలోకాన మానససరోవరం అందాల‌ను వీక్షించ‌డానికి అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్ళు సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకొంటుంది. దానితో ఆమెకి స్వర్గలోక ద్వారాల వద్దే నిషేధం కలుగుతుంది.

ఆ ఉంగ‌రం రాజుకు ల‌భిస్తోంది. అది రాజు ద‌గ్గ‌ర‌ ఉందని తెలుసుకొన్న ఇంద్రజ పిల్లల ద్వారా అతనికి చేరువై ఆ ఉంగరాన్ని సంపాదించే ప్రయత్నంతో నిజంగానే అతనిని ప్రేమిస్తుంది. మహాదృష్ట (అమ్రిష్ పురి) అనే దృష్ట మాంత్రికుడు దేవకన్యను బలిస్తే తనకి మరిన్ని శక్తులు వస్తాయని ఇంద్రజని అపహరిస్తాడు. ఇంద్రజ అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకి ముగ్ధుడైన రాజు మహాదృష్ట నుండి ఆమెను రక్షించటంతో, ఉంగరాన్ని, స్వర్గలోక ప్రవేశాన్ని త్యజించి, మనిషిగా రాజుతోనే జీవించాలని నిర్ణయించుకోవటంతో ఈ క‌థ పూర్త‌వుతుంది.అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి సహాయ పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించాడు.




Show Full Article
Print Article
Next Story
More Stories