Top
logo

Celebrity Birthdays: నేడు (08-04-2021) బర్త్‌డే చేసుకోనున్న టాలీవుడ్ సెలెబ్రిటీస్

Today (8th April) Birthday Celebrities in Tollywood
X

అల్లు అర్జున్, నిత్యా మీనన్, అఖిల్ అక్కినేని

Highlights

Celebrity Birthdays: టాలీవుడ్ లో నేడు అల్లు అర్జున్, నిత్యా మీనన్, అక్కినేని అఖిల్ ముగ్గురు బర్త్‌డే లు చేసుకోనున్నారు.

Celebrity Birthdays: టాలీవుడ్ లో నేడు (8th April) ముగ్గురు ప్రముఖ సెలెబ్రిటీలు బర్త్‌డే లు చేసుకోనున్నారు. వారిలో అల్లు అర్జున్ (8th, April 1983), నిత్యా మీనన్(8th, April 1988), అక్కినేని అఖిల్(8th, April 1994) ఉన్నారు. ఒకరు స్టైల్ తో యూత్ ని కట్టిపడేయగా, మరొకరు తన అందమైన నటనతో ప్రేక్షకుల మదిని దోచుకోగా, ఇంకోకరు తన అందంతో అలరించారు. నేడు పుట్టిన రోజులు చేసుకోనున్న ఈ ముగ్గురి ప్రముఖులకు హెచ్‌ఎం టీవీ తరపున హ్యాపీ బర్త్‌ డే తెలియజేస్తున్నాం.

ఈ సందర్భంగా ఈ ముగ్గురు గురించి కొన్ని విషయాలు మీ కోసం అందిస్తున్నాం..

Allu Arjun Birth Day: అల్లు అర్జున్ (Allu Arjun):

అల్లు అర్జున్ చెన్నై(ఏప్రిల్ 8, 1983) లో పుట్టాడు. 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. చిన్నప్పుడే "విజేత" సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళి.. ఏకంగా అందులో నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటి సారి కనిపించాడు. స్కూల్‌లో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు.

చిన్నప్పటి నుంచే అల్లు అర్జున్ కు డ్యాన్స్ అంటే అమితాసక్తిని చూపించేవాడు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్ తో కలిసి డ్యాన్స్ లు వేసి అందరిని అలరింపజేసేవారు. మొదట్లో బన్నీ నటుడు కావడానికి ఆయన తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది.


మొదటి సినిమాలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి 100 వ సినిమాగా వచ్చిన గంగోత్రి లో నటించి, విజయం సాధించాడు. అలా తొలి సినిమాతోనే మ్యాజిక్‌ చేశాడు హీరో అల్లు అర్జున్‌. తర్వాత చేసిన ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టాడు. ఫ్లాప్‌ అన్న పదానికి చాలా దూరంగా ఉంటాడు ఈ హీరో. ఈ మధ్య అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యం చుట్టూ అల్లుకున్న 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు.

ఇక అల్లు అర్జున్ వివాహం మార్చి 6, 2011న హైదరాబాదుకు చెందిన స్నేహారెడ్డితో జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు.

Nithya Menen Birth Day: నిత్యా మీనన్ (Nithya Menen):

నిత్యా మీనన్ బెంగుళూరు స్థిరపడిన మలయాళ కుటుంబంలో 1988, ఏప్రిల్ 8 న జన్మించింది. హీరోయిన్ అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది. వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే చాలా ఆసక్తి చూపేది ఇష్క్ బ్యూటీ. తన అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకుల గుండె జారి గల్లంతయ్యేలా చేసింది.

"అలా మొదలైంది" సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా దక్కించుకుంది. అంతకుముందు బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. అలాగే మోహన్‌లాల్‌తో కూడా ఓ సినిమాలో కనిపించింది. మాతృభాష మలయాళం అయినా.. వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే తొలిసినిమా 'అలా మొదలైంది'లోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది. "ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..", "అబ్బబ్బో.. అబ్బో.." అంటూ పాడిన రెండు పాటలు విజయవంతం అయ్యాయి.


తెలుగుతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ రాణిస్తోంది నిత్యామీనన్. 'అలా మొదలైంది' తర్వాత 'సెగ', '180' వంటి చిత్రాలు చేసింది. కానీ, అవి బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన "ఇష్క్" మాత్రం బంపర్ హిట్‌గా నిలిచింది. మరోసారి నితిన్‌తో జతకట్టి "గుండెజారి గల్లంతయ్యిందే" సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ జంట హిట్ పెయిర్ గా పేరొందింది. 'జబర్దస్త్', 'ఒక్కడినే' చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది మలయాళి బ్యూటీ. ఈ ఏడాది తన 11 వ సినిమాగా 'నిన్నిలా.. నిన్నిలా' లో నటించింది.

Akhil Akkineni Birth Day: అక్కినేని అఖిల్ (Akhil Akkineni):

అక్కినేని నాగార్జున, అమల అక్కినేని జంటకు ఏప్రిల్ 8, 1994లో కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు. అక్కినేని అఖిల్ జన్మించాడు. బాల్య నటుడిగా 'సిసింద్రీ' సినిమాలో తన తండ్రి అక్కినేని నాగర్జునతో కలిసి నటించాడు.

2014లో విక్రం కుమార్ దర్శకత్వంలోని 'మనం' చిత్రంలో క్లైమాక్స్ లో కనిపించాడు. హీరోగా తొలిచిత్రం 'అఖిల్' (2015) చిత్రంలో నటించాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలా వరుసగా ఫ్లాపులే ఎదురయ్యాయి. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు అక్కినేని వారసుడు. తన బర్త్ డే సందర్భంగా తన ఐదో చిత్రాన్ని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.


ప్రస్తుతం అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 సంస్థ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాన్ని చేస్తున్నాడు. జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా అయినా భారీ విజయం అందివ్వాలని కోరుకుందాం.

Web TitleToday (8th April) Birthday Celebrities in Tollywood - Allu Arjun Birth Day -Nithya Menen Birth Day - Akhil Akkineni Birth Day
Next Story