సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఫామ్ హౌస్ లో కాకుండా మహాప్రస్థానంలో చేయడానికి కారణం ఇదే!

Super Star Krishna Funerals: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్న తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 17 Nov 2022 7:01 PM IST
This is the Reason why Superstar Krishnas Last Rites Were Done in Mahaprasthanam Instead of in Farm House
X

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఫామ్ హౌస్ లో కాకుండా మహాప్రస్థానంలో చేయడానికి కారణం ఇదే!

Super Star Krishna Funerals: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్న తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. అయితే దిగ్గజ నటుడికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడంపై సూపర్ స్టార్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. చిరస్థాయిగా నిలిచిపోయేలా స్మారక చిహ్నం నిర్మించే విధంగా పద్మాలయ స్టూడియో వంటి ప్రైవేట్ స్థలంలో దహన సంస్కారాలు చేయాలని మహేష్ ఎందుకు ఆలోచించలేదని ఫ్యాన్స్ అంటున్నారట. తాజాగా ఈ విషయంపై ‍కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించారు. ఇలా చేయడానికి ఓ కారణం ఉందని.. కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు నిర్వహించామని, రమేష్‌ బాబు అంత్యక్రియలు కూడా అక్కడే చేసినట్లు తెలిపారు.

మరోవైపు కృష్ణగారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెమోరియల్ హాల్ లో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలు, ఫొటోలు, షీల్డ్ లను ఉంచనున్నట్టు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story