చంద్రముఖి 2 లో కీలకపాత్ర పోషించనున్నబాలీవుడ్ బ్యూటీ

This Bollywood beauty played a key role in Chandramukhi 2
x

చంద్రముఖి 2 లో కీలకపాత్ర పోషించనున్నబాలీవుడ్ బ్యూటీ

Highlights

* మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన పి వాసు ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు

Chandramukhi 2: 2005లో పి వాసు దర్శకత్వంలో జ్యోతిక, రజినీకాంత్ మరియు ప్రభు ప్రధాన పాత్రలలో నటించిన "చంద్రముఖి" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో విభిన్న నటులతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా విడుదలైన 17 ఏళ్ల తర్వాత తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కనుంది.

ప్రముఖ నటుడు, డైరెక్టర్ మరియు కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన పి వాసు ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ మరియు జ్యోతిక స్థానంలో కంగనా రనౌత్ ఈ సినిమాలో నటించనున్నారు అని తెలుస్తోంది.

ఈ మధ్యనే "తలైవి" సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్న కంగనా రనౌత్ కి ఈ సినిమాతో టాలీవుడ్ లో కూడా మంచి పేరు దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సినిమాకి సంబంధించిన కొన్ని ప్యాలెస్ సన్నివేశాల షూటింగ్ తో చిత్ర బృందం బిజీగా ఉంది. అప్పట్లో సంచలనం సృష్టించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories