ముగ్గురు హీరోలకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు ముందుగా ప్రభాస్ కు వెళ్ళాయా?

These Superhit Films Rejected By Prabhas Made Career Of Allu Arjun, Mahesh Babu & Jr. NTR
x

ముగ్గురు హీరోలకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు ముందుగా ప్రభాస్ కు వెళ్ళాయా?

Highlights

ముగ్గురు హీరోలకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు ముందుగా ప్రభాస్ కు వెళ్ళాయా?

Superhit Films Rejected By Prabhas: ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు అందులో ఒకరు నో చెప్పిన కథ మరొకరు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు గ్రాఫ్ ఉన్నట్టే ప్రభాస్ కూడా తనదైన శైలిలో స్టార్ హీరోగా మారారు. అయితే ఆసక్తికరంగా కొందరు స్టార్ హీరో లకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు ముందుగా ప్రభాస్ చేతిలోకి వెళ్ళాయి.

ఉదాహరణకి మహేష్ బాబు కి మార్చి పోలేని బ్రేక్ ఇచ్చిన "ఒక్కడు" సినిమా కథ ముందుగా విన్నది ప్రభాస్. ఆ తర్వాతే అది మహేష్ బాబు కి వెళ్ళింది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్ హిట్ అయిన "సింహాద్రి" కూడా ముందుగా ప్రభాస్ చేయాల్సింది. అల్లు అర్జున్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన "ఆర్య" సినిమా కోసం కూడా ప్రభాస్ ఫస్ట్ ఆప్షన్. అలా అని ప్రభాస్ వద్దు అన్న సినిమాల వల్లే మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ స్టార్ హీరో లు అయ్యారు అని చెప్పలేం.

ఎందుకంటే ఈ ముగ్గురు వద్దు అన్న సినిమాల కారణంగా నే ప్రభాస్ స్టార్ అయ్యారు. ప్రభాస్ కి మొదటి బ్లాక్ బస్టర్ అయిన "వర్షం" సినిమా ముందుగా మహేష్ బాబు చేయాల్సింది. అలాగే "మిర్చి" కథ కూడా మొదట ఎన్టీఆర్ విని నో చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా విని నో అన్నారు. ఆ తర్వాతే "మిర్చి" ప్రభాస్ కి వెళ్ళింది. కాబట్టి ఎవరి సినిమాల వల్ల వాళ్ళు స్టార్ లు అయ్యారు కానీ ఒకరు వద్దన్న సినిమాల వల్లే స్టార్ డం వచ్చింది అని చెప్పలేం.

Show Full Article
Print Article
Next Story
More Stories