ఒకే రోజున ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన చిరు, విజయశాంతి

ఒకే రోజున ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన చిరు, విజయశాంతి
x
Highlights

తెలుగు చిత్రపరిశ్రమలో చాలా హిట్ పెయిర్స్ ఉన్నాయి. అందులో చిరంజీవి- విజయశాంతి ఒకటి. ఇద్దరు కలిసి మొత్తం 19 సినిమాల్లో నటించారు. నటనలోనే కాదు డాన్స్...

తెలుగు చిత్రపరిశ్రమలో చాలా హిట్ పెయిర్స్ ఉన్నాయి. అందులో చిరంజీవి- విజయశాంతి ఒకటి. ఇద్దరు కలిసి మొత్తం 19 సినిమాల్లో నటించారు. నటనలోనే కాదు డాన్స్ లోనూ చిరుకి విజయశాంతి గట్టిపోటినే ఇచ్చారు. సంఘర్షణ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం మెకానిక్ అల్లుడు వరకు కొనసాగింది . ఇందులో దాదాపుగా అన్ని హిట్లే.. ఇక మెకానిక్ అల్లుడు సినిమా తర్వాత మళ్ళీ చిరంజీవి, విజయశాంతి కలిసి నటించింది లేదు.

చిరంజీవి కంటే ముందే విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారు. 2006లో నాయుడమ్మ సినిమా తర్వాత ఆమె పూర్తి స్థాయి రాజకీయాలకి పరిమితం అయ్యారు. మళ్ళీ 2019లో అంటే 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకేవ్వరు చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఇక చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత రాజకీయాలకి గుడ్ బై చెప్పి ఖైది నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాకా ఇద్దరి మద్య చాలా గ్యాప్ ఏర్పడింది. అదే విధంగా రాజకీయాల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాల ఏర్పడ్డాయి.

అయితే వీరి రీఎంట్రీని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇద్దరు ఒకే రోజున ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు సంవత్సరాలు వేరు అయినప్పటికీ డేట్స్ ఒకటే కావడం విశేషం.. చిరంజీవి ఖైది నెంబర్ 150 సినిమా 11 జనవరి 2017న విడుదల కాగా, విజయశాంతి సరిలేరు నీకెవ్వరు చిత్రం 11 జనవరి 2020న విడుదలైంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరి సినిమాలకి పని చేసిన డీఓపీ, సంగీత దర్శకులు ఒకేరే కావడం విశేషం.. వారే రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్ ..

ఇక సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి విజయశాంతితో తనకున్నా బంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళాకా నన్ను ఎలా తిట్టాలని అనిపించిందని చిన్నపిల్లాడిలా స్టేజీపైనే విజయశాంతిని అడిగేశారు చిరు. రాజకీయాలు వేరు సినిమాలు వేరు అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories