Tuck Jagadish Movie: "టక్‌ జగదీష్‌" ఓటీటీ విడుదలపై ఎగ్జిబిటర్ల ఆగ్రహం

Theatre Owners Association Serious on Nani Tuck Jagadish Movie Release in OTT Platform
x

థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ (ఫైల్ ఫోటో)

Highlights

* సెప్టెంబర్ 10న టక్‌ జగదీష్‌ మూవీ ఓటీటీ వేదికగా రిలీజ్ * ఓటీటీ క్రేజీ సినిమాలను రిలీజ్ చేస్తుండడంతో ఎగ్జిబిటర్ల ఆగ్రహం

Tuck Jagadish Movie: టాలీవుడ్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఓటీటీలో క్రేజీ సినిమాలను ఓటీటీలో రిలీజ్‌ చేయడాన్ని ఎగ్జిబిటర్లు వ్యతిరేకిస్తున్నారు. సెప్టెంబర్ 10న టక్‌ జగదీష్‌ ఓటీటీ వేదికగా రిలీజ్‌ కానుంది. సరిగ్గా అదే రోజు "లవ్‌స్టోరీ" మూవీ థియేటర్లలో దిగిపోనుంది. అయితే ఓటీటీలో సినిమాలను రిలీజ్‌ చేస్తున్న నిర్మాతలపై ఎగ్జిబీటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇవాళ తెలంగాణ థియేటర్ల ఓనర్ల అసోసియేషన్‌ సమావేశం కానున్నారు. మరోవైపు టక్‌జగదీశ్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తుండడంతో హీరో నాని కూడా అసంతృప్తిగా ఉన్నారు. తాను థియేటర్లలో రిలీజ్‌ చేయడాన్నే ఇష్టపడతానని చెప్పుకచ్చారు. అయితే నిన్న నాని నిర్మాతల ఇష్టామంటూ ట్వీట్‌ చేశారు. గతంలో నాని వీ మూవీ కూడా ఓటీటీలోనే విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories