ప్రభాస్ సినిమా గురించి ప్రముఖ నిర్మాత ఏమంటున్నారంటే..

The Star Producer Made interesting Comments about the Movies Spirit and Animal
x

ప్రభాస్ సినిమా గురించి ప్రముఖ నిర్మాత ఏమంటున్నారంటే..

Highlights

*"స్పిరిట్" మరియు "యానిమాల్" సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన స్టార్ నిర్మాత

Tollywood: బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలలో టీ సిరీస్ కూడా ఒకటి. ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను అందించిన ఈ నిర్మాణ సంస్థ 2023లో కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. "షేజాదా", "తూ జూతీ మైన్ మకర్", "భోళా", "ఆది పురుష్", "స్పిరిట్" మరియు "యానిమల్" వంటి ఆసక్తికరమైన సినిమాలను టి సిరీస్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో "యానిమల్" మరియు "స్పిరిట్" సినిమాలకు "అర్జున్ రెడ్డి" ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

"యానిమల్" సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ కపూర్ మరియు బాబి డియోల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య రిలేషన్షిప్ ని ఇంతకుముందు ఎన్నడూ చూపించని విధంగా చూపించనున్నారని అన్నారు భూషణ్ కుమార్. ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, రివెంజ్, థ్రిల్, మరియు మంచి మ్యూజిక్ ఉండబోతున్నాయని అన్నారు.

ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న "స్పిరిట్" సినిమా షూటింగ్ కూడా ఈ ఎడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ, "స్పిరిట్ ఒక విభిన్నమైన కాప్ డ్రామా. అందులో ఒక కొత్త స్టైల్ ఉంటుంది. ఈ సినిమా కూడా ఇంతకుముందు ఎన్నడూ ఎవరూ చూడనటువంటి విధంగా ఉంటుంది," అని అన్నారు. ప్రభాస్ సినిమా పై దీంతో మరిన్ని అంచనాలు పెరిగాయి అని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories