Viral Video: బిచ్చగాడిలా ముంబై వీధుల్లో తిరిగిన స్టార్ హీరో.. వీడియో వైరల్

The star hero beggar getup the streets of Mumbai
x

బిచ్చగాడిలా ముంబై వీధుల్లో తిరిగిన స్టార్ హీరో.. వీడియో వైరల్

Highlights

సినిమాల కోసం హీరోలు చాలా కష్టపడుతుంటారు. మూవీలో వారి పాత్రల కోసం అందుకు అనుగుణంగా వారిని మార్చుకుంటారు. జుట్టు, గడ్డం పెంచుకోవడం, బరువు పెరగడం, తగ్గడం వంటివి చేస్తుంటారు.

Aamir Khan : సినిమాల కోసం హీరోలు చాలా కష్టపడుతుంటారు. మూవీలో వారి పాత్రల కోసం అందుకు అనుగుణంగా వారిని మార్చుకుంటారు. జుట్టు, గడ్డం పెంచుకోవడం, బరువు పెరగడం, తగ్గడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో బిచ్చగాడిలా మారి చూపించాడు. అంతేకాదు ముంబై వీధుల్లో తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. దీనికి కారణం అతని వేషధారణ. అడవి మనిషిలా వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు. రాతియుగానికి చెందిన మనిషిలా పొడవాటి గడ్డం, జుట్టు, జంతువుల చర్మాన్ని చుట్టుకుని, కాళ్లకు బూట్లు ధరించి ముంబై వీధుల్లో తిరిగాడు. అంతేకాదు రోడ్లపై డ్యాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సమయంలో అమీర్ ఖాన్‌ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. అతని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ షాక్ అయ్యారు.

సినిమాల్లో భాగంగా అలా చేశారని కొందరు అనుకుంటుంటే.. మరికొందరు అది ప్రకటన కోసం కావచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ బిచ్చగాడిలా రోడ్డుపై రావడానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. అమీర్ ఖాన్ ఇప్పుడు అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బిచ్చగాడిలా వేషం వేశారు. కోకా కోలా ఇండియా ఛార్జ్డ్ అనే డ్రింక్‌ని పరిచయం చేసింది. కంపెనీ తన ప్రమోషన్ కోసం అమీర్ ఖాన్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను‌ ఉపయోగించుకుంది. ఈ యాడ్‌‌లో భాగంగా ఛార్జ్డ్ డ్రింక్ తాగిన తర్వాత డ్యాన్స్ చేసే విధంగా విభిన్నంగా చూపించారు.



అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఓ యాడ్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు దీనిని ఇష్టపడుతున్నారు. బ్రాండ్‌కు గొప్ప ప్రమోషన్ వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అమీర్ ఖాన్‌కు ఇలాంటి వేషం కొత్తేమీ కాదు. గతంలో సౌరబ్ గంగూలీ ఇంటికి మారువేషంలో వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచారు అమీర్ ఖాన్.

Show Full Article
Print Article
Next Story
More Stories