కొరటాల శివ పై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు

NTR30: "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయవలసింది.

Arun Chilukuri
Published on: 19 Nov 2022 6:37 PM IST
Shooting of NTR Koratala Siva’s Film Postponed Again
X

కొరటాల శివ పై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు

NTR30: "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయవలసింది. ఇప్పటికే ఈ సినిమాను ప్రకటించి చాలా కాలం గడిచిపోయింది. ఎప్పుడో సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం కానీ ఆ తర్వాత మాత్రం సినిమా గురించి ఒక అప్డేట్ కూడా లేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పారని కొరటాల ఆ మార్పులు చేయడానికి కొంత సమయం పడుతుందని అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మరింత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సినిమా షూటింగ్ ఫిబ్రవరి దాకా మొదలయ్యేలా కనిపించటం లేదు. ఇక ఇంకా మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ మొదలు కాదు అనే వార్త తెలిసి అభిమానులు సైతం చిరాకు పడుతున్నారు. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో తిరిగి తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొరటాలు చేస్తున్న ప్రయత్నాలు మంచిదే అయినప్పటికీ సినిమా షూటింగ్ కోసం ఇంకా ఎన్ని నెలల సమయం కావాలి అని అభిమానులు తిరిగి ప్రశ్నిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story