logo
సినిమా

అమెరికాలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్న "ఆర్ఆర్ఆర్" బృందం

The RRR Team Is Planning An Event In America
X

అమెరికాలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్న "ఆర్ఆర్ఆర్" బృందం

Highlights

RRR Movie: మళ్లీ భారీగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్న రాజమౌళి.

RRR Movie: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్.ఆర్.ఆర్". నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి 7న విడుదల అవుతుందని అందరూ అనుకొన్నారు. దర్శక నిర్మాతలు సైతం ఈ చిత్ర ప్రమోషన్ పై బాగానే దృష్టిపెట్టారు. కానీ కరోనా కారణంగా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. దానికి కారణం సినిమా వాయిదా పడడం. తాజాగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాని మార్చి 25న విడుదల చేస్తున్నట్లుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మళ్లీ ఫ్రెష్ గా ప్రమోషన్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఒక పెద్ద ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ రేంజ్ లో అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరన్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Web TitleThe "RRR" Team Is Planning An Event In America
Next Story