"మాచర్ల నియోజకవర్గం" టీజర్ కు విడుదల తేదీ ఖరారు

మాచర్ల నియోజకవర్గం టీజర్ కు విడుదల తేదీ ఖరారు
x

"మాచర్ల నియోజకవర్గం" టీజర్ కు విడుదల తేదీ ఖరారు

Highlights

టీజర్ కోసం విడుదల తేదీ ని నిర్ణయించిన "మాచర్ల నియోజకవర్గం" బృందం.

Nithin: నితిన్ హీరోగా ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "మాస్ట్రో ". హిందీ లో "అందాధున్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై పరవాలేదు అనిపించింది. తాజాగా ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "మాచర్ల నియోజకవర్గం" పైనే పెట్టుకున్నాడు నితిన్. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఈ మధ్యనే బంగార్రాజు, శ్యామ్ సింగరాయి సినిమాల్లో కూడా కనిపించిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

హాట్ బ్యూటీ కేథరీన్ థెరీసా కూడా ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా ఈ చిత్రం టీజర్ ను మార్చి లో భారీ ఎత్తున విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఒక స్టూడెంట్ గాను మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానూ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కాబోతోందని దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories