ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం అదేనా?

The Reason For The Delay in The NTR30 Movie
x

ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం అదేనా?

Highlights

JR.NTR: ఎన్టీఆర్ సినిమా అందుకే లేట్ అవుతోందా?

JR.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి సినిమాని మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ కూడా ఎన్టీఆర్ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు. ఈ మధ్యనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన డైలాగ్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది.

అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి మాత్రం వెళ్ళటం లేదు. దీంతో కొరటాల చెప్పే కథ ఎన్టీఆర్ కి నచ్చటం లేదని, ఇంకా ఒక మంచి కథ తో రమ్మని చెబుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో వైపు ఈ సినిమా హీరోయిన్ ఇంకా సెట్ అవ్వకపోవటం వలనే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది అంటూ మరికొందరు చెబుతున్నారు. అసలైతే ఆలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది. ఆ తర్వాత జాన్వికపూర్ ని అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు.

శ్రద్ధ కపూర్, దిశా పటాని, సారా అలీ ఖాన్, కృతిసనన్ వంటి ఇతర బాలీవుడ్ నటులను కూడా సంప్రదించారు కానీ ఒక్కరు కూడా ఈ సినిమాకి సెట్ అవలేదు. కొందరేమో 7 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ అడుగుతుండగా మరికొందరి డేట్లు ఖాళీ ఉండటంలేదు. దీంతో హీరోయిన్ విషయం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం వల్లనే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories