ఏపీలో సాహో మూవీ టికెట్ల ధర పెంపుపై సందిగ్ధత

ఏపీలో సాహో మూవీ టికెట్ల ధర పెంపుపై సందిగ్ధత
x
Highlights

భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌‌లో నిర్మించిన సాహో చిత్ర టికెట్ల ధర పెంపుపై ఏపీలో సందిగ్ధత నెలకొంది. సినిమా విడుదల అయిన తొలి వారం పాటు స్పెషల్ షోలతో...

భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌‌లో నిర్మించిన సాహో చిత్ర టికెట్ల ధర పెంపుపై ఏపీలో సందిగ్ధత నెలకొంది. సినిమా విడుదల అయిన తొలి వారం పాటు స్పెషల్ షోలతో పాటు టికెట్ల ధర పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న చిత్ర నిర్మాతల విజ్ఞప్తికి పూర్తి స్ధాయిలో స్పందించలేదు. స్పెషల్ షోలకు మాత్రమే అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. దీంతో టికెట్ల ధర పెంపు ఉండదని పరోక్షంగా ప్రభుత్వం చెప్పినట్టు అయ్యింది. ఇదే సమయంలో ఒక్కో సినిమాకు ఒక్కోలా వ్యవహారించలేమంటూ CMO నుంచి లీకులు వచ్చాయి. అన్ని సినిమాలకు ఒకే విధానం వర్తిస్తుందని ... టికెట్ల పెంపులో పక్షపాతం చూపలేమంటూ ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎవరి సినిమా అయినా ప్రభుత్వం సమానంగా చూస్తుందంటూ తెలియజేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories